ట్రాన్స్ జెండర్ హత్యకేసులో నిందితుడికి యావజ్జీవశిక్ష ఖరారు

Old Criminal sentenced for life for murder of tansgender : హైదరాబాద్ లో ఐదేళ్ల క్రితం జరిగిన ట్రాన్స్ జెండర్ హత్య కేసులో నేరంనిరూపించబడటంతో సిటీ సివిల్ కోర్టు నిందితుడికి జీవితఖైదు విధించింది. నిందితుడు పలు హత్యకేసులతో సంబంధం ఉన్న పాత నేరస్ధుడు. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని వెంకట్ యాదవ్ అలియాస్ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి 2016, జనవరి 16న ట్రాన్స్‌జెండర్‌ను హత్య చేశాడు.
ఈ హత్య కేసులో వెంకట్‌ను సిటీ కోర్టు దోషిగా తేలస్తూ.. జీవిత ఖైదు విధించింది. ట్రాన్స్‌జెండర్ కావేరి బ్రహ్మణిని ఇందిరా నగర్‌లో హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. అయితే నిందితుడు వెంకట్ పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.