Sangareddy : బొలెరోను ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. డ్రైవర్ సజీవదహనం
Sangareddy : సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో మంగళవారం ఉదయం (మే 10) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బొలెరోను ఢీకొట్టింది.

One Burnt Gave, Three Injured After Private Travels Bus Hit Bolero Vehicle In Hyderabad
Sangareddy : సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో మంగళవారం ఉదయం (మే 10) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బొలెరోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరోలో మంటలు చెలరేగి డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ప్రమాద సమయంలో బొలెరోలో ఐదుగురు వ్యక్తులు ఉండగా.. వారిలో డ్రైవర్ మినహా మిగిలినవారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

One Burnt Gave, Three Injured After Private Travels Bus Hit Bolero Vehicle In Hyderabad
బాధితులంతా కర్ణాటక వాసులుగా గుర్తించారు. పెళ్లి సమానుతో ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తున్న సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు. రాంగ్ రూటులో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ప్రైవేటు ట్రావెల్ బస్సు బొలెరోను ఢీకొట్టింది. డ్రైవర్ సమీర్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. గాయపడిన ముగ్గురిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also : Nellore : కన్న కొడుకును హత్య చేసిన తండ్రి..ఎందుకో తెలుసా?