Cricket Betting: క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న ముఠా అరెస్ట్

విదేశాల్లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ ల పై స్థానికంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న బెట్టింగ్ ముఠాను హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు

Cricket Betting: క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్న ముఠా అరెస్ట్

Arrest

Updated On : January 18, 2022 / 7:03 AM IST

Cricket Betting: విదేశాల్లో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ ల పై స్థానికంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న బెట్టింగ్ ముఠాను హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కధనం ప్రకారం..హైదరాబాద్ చిలకలగూడ పరిధిలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు సోమవారం సాయంత్రం హైదరాబాద్ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రామకృష్ణ, సురేష్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also read: Dhanush Aishwaryaa : షాకింగ్.. విడిపోయిన మరో ప్రముఖ సినీజంట

వీరు ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ క్రికెట్ మ్యాచ్ లపై బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సెల్ ఫోన్ లో ప్రత్యేకంగా బెట్టింగ్ కోసం తయారు చేసిన యాప్ ల ద్వారా వీరు బెట్టింగ్ కి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వ్యవస్థీకృత(ఆర్గనైజ్డ్) విధానం ద్వారా నిందితులు క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. నిందితుల నుంచి రూ. లక్ష10 వేల నగదు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు, తదుపరి విచారణ నిమిత్తం నిందితులను చిలకలగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Also read: DA PRC : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్