DA PRC : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలను జగన్ సర్కార్ విడుదల చేసింది. అలాగే పీఆర్‌సీకి సంబంధించి 23శాతం ఫిట్‌మెంట్ అమలు చేస్తూ మరో జీవోను జారీ చేసింది.

DA PRC : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

Da Prc

DA PRC : ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలను జగన్ సర్కార్ విడుదల చేసింది. 2019 జూలై నుంచి 2021 డిసెంబర్ 31 వరకు పెండింగ్ లో ఉన్న అన్ని డీఏలను విడుదల చేసింది. ఇటీవల సీఎం జగన్‌ ప్రకటన మేరకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే పీఆర్‌సీకి సంబంధించి 23శాతం ఫిట్‌మెంట్ అమలు చేస్తూ మరో జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. ఏప్రిల్ 1, 2020 నుంచి మోనిటరీ బెనిఫిట్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Chintamani : చింతామణి నాటకంపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం, ప్రదర్శిస్తే కఠిన చర్యలు

డీఏ బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు గతేడాది డిసెంబర్‌లో సీఎం జగన్ ఉద్యోగ.. ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ కు అనుగుణంగా వచ్చే జనవరి నెల నుంచి డీఏను జమ చేస్తామని హామీ ఇచ్చారు.

Feet Swelling : పాదాల్లో వాపులా!…సమస్యేంటో తెలుసుకోవాల్సిందే?

ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు 2019 జూలై ఒకటి నుంచి డీఏ బకాయిలను విడుదల చేయడానికి ఆర్దికశాఖ డిసెంబర్ లోనే అధికారిక ఉత్తర్వులిచ్చింది. నెలకు 5.24 శాతం డీఏ బకాయిలు విడుదల చేయాలని ఆ ఉత్తర్వుల్లో తెలిపింది. తాజాగా దీనిపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది.