Extra Marital Affair : భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కానిస్టేబుల్ ముక్కు,చెవులు కోసేసిన భర్త

తన భార్యను బ్లాక్ మెయిల్ చేస్తూ, ఆమెను లైంగికంగా వేధిస్తూ  వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఓ పోలీసు కానిస్టేబుల్‌ చెవులు, ముక్కు, పెదాలు కోసేశాడు ఆమె భర్త. 

Extra Marital Affair : భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న కానిస్టేబుల్ ముక్కు,చెవులు కోసేసిన భర్త

Extra Marital Affair

Updated On : August 1, 2022 / 6:41 PM IST

Extra Marital Affair :  తన భార్యను బ్లాక్ మెయిల్ చేస్తూ, ఆమెను లైంగికంగా వేధిస్తూ  వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఓ పోలీసు కానిస్టేబుల్‌ చెవులు, ముక్కు, పెదాలు కోసేశాడు ఆమె భర్త.  ఈ సంఘటన పాకిస్థాన్‌లోని పంజాబ్‌  రాష్ట్రం ఝాంగ్‌ జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది.

మహమ్మద్   లిప్తీకర్ అనే వ్యక్తి భార్యా పిల్లలతో జీవిస్తున్నాడు.  కాసిమ్ హతయ అనే కానిస్టేబుల్  లిప్తీకర్ భార్యపై కన్నేశాడు.  ఆమెను లొంగ దీసుకోటానికి ఆమె కుమారుడిని చంపేస్తానని బెదిరించాడు.  దీంతో ఆమె అతడి వద్దకు వెళ్ళగా  ఆమెపై అత్యాచారం చేసి అదంతా వీడియో తీశాడు.  ఆ వీడియో చూపించి తరచూ ఆమెను లైంగికంగా వేధించసాగాడు.

ఇది తట్టుకోలేని భర్త  గతనెల పోలీస్‌ కానిస్టేబుల్‌  కాసిమ్ హతయ  పై  పీపీసీలోని 354(మహిళపై దాడి), 384(దోపిడి), 292(అక్రమ సంబంధం)వంటి సెక్షన్ల కింద కేసు పెట్టాడు. అయినా కానీ అతని   వేధింపులు ఆగక పోవటంతో   జులై 31 ఆదివారం…   మరోక 12 మందితో కలిసి   డ్యూటీ దిగి ఇంటికి వెళుతున్న కానిస్టేబుల్ కాసిమ్ హతయను అపహరించారు.

నిర్మానుష్య  ప్రదేశానికి తీసుకు వెళ్లి తీవ్రంగా హింసించారు. ఆతర్వాత చాకుతో హతయ చెవులు, ముక్కు, పెదాలు కోసేశారు. బాధిత కానిస్టేబుల్‌ను ఝాంగ్‌ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న లిప్తీకర్ అతని స్నేహితులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.

Also Read : Rajasthan : అమ్మవారి అవతారాన్నంటూ కత్తితో బాలిక హల్ చల్-చెల్లెలి గొంతుకోసి హత్య