రాజస్ధాన్ బోర్డర్ లో పాకిస్తాన్ గూఢచారి అరెస్టు

  • Published By: chvmurthy ,Published On : September 13, 2019 / 08:18 AM IST
రాజస్ధాన్ బోర్డర్ లో పాకిస్తాన్ గూఢచారి అరెస్టు

Updated On : September 13, 2019 / 8:18 AM IST

రాజస్ధాన్ లోని బర్మేర్ సమీపంలో భారత్-పాక్ సరిహద్దుల వద్ద పాకిస్తాన్ కు చెందిన కిషోర్ అనే ఒక అనుమానిత వ్యక్తిని బీ.ఎస్.ఎఫ్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. భారత్ లో గూఢచర్యం చేసేందుకు అతడు భారత్ లోకి అక్రమంగా ప్రవేశించినట్లు గుర్తించారు. విచారణలో కిషోర్ పాకిస్తానీగా చెప్పుకున్నాడు. సరిహద్దుల్లోని బారికే్డ్ల కింద నుంచి దూరి భారత్ లోకి అక్రమంగా ప్రవేశించినట్లు వెల్లడించాడు. 

దర్యాప్తులో  కిషోర్ కొన్ని కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. బీఎస్ఎఫ్,  భారత ఆర్మీకి చెందిన  కార్యకలాపాల గురించి తెలుసుకునేందుకే తన మేన మామ భారత్ పంపించినట్లు చెప్పాడు. భారత్ లోకి ప్రవేశించటానికి పాక్ ఆర్మీ సాయం చేసిందని వివరించాడు.

పాకిస్తాన్ నుంచి ఖోఖ్రాపర్ వరకు రైలులో వచ్చి, అక్కడి నుంచి పాక్ ఆర్మీ సహయంతో సరిహద్దు దాటినట్లు కిషోర్ తెలిపాడు. మొదటగా కిషోర్ ను గ్రామస్తులు పట్టుకుని బీఎస్ఎఫ్ అధికారులకు అప్పచెప్పారు. కాగా గత 3 రోజులుగా విచారిస్తున్నప్పటికీ….విచారణలో కిషోర్ పదే పదే మాట మార్చటంతో బీఎస్ఎఫ్ అధికారులు మరింత లోతుగా విచారించేందుకు అతడిని జైపూర్ తరలించారు.