యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్.. హైదరాబాద్‌కు తరలిస్తున్న పోలీసులు

ప్రణీత్ ను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. పలువురు అతడిపై ఫిర్యాదు చేశారు.

యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్.. హైదరాబాద్‌కు తరలిస్తున్న పోలీసులు

Praneeth Hanumantu : సోషల్ మీడియా కీచకుడు, ప్రముఖ యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్ అయ్యాడు. బెంగళూరులో ప్రణీత్ హనుమంతుని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు కోర్టులో ప్రణీత్ ను హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద హైదరాబాద్ తరలిస్తున్నారు పోలీసులు. తండ్రీ కూతుళ్లపై సోషల్ మీడియాలో చర్చ పెట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు ప్రణీత్. తండ్రీ కూతుళ్లపై హనుమంతు చేసిన నీచమైన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి.

ఫ్రెండ్స్ తో కలిసి అతడు చేసిన అసభ్యకర, అభ్యంతకర కామెంట్స్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రణీత్ ను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. హీరో సాయిధరమ్ తేజ్ సహా పలువురు అతడిపై ఫిర్యాదు చేశారు. దీంతో సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రణీత్ పై కేసు నమోదు చేసింది. ప్రణీత్ తో పాటు మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు.

యూట్యూబర్ ప్రణీత్ పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు ఆదివారం కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. ప్రణీత్ తో పాటు అతడి బ్యాచ్ ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ప్రణీత్ ను అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్ కామెంట్లను చాలా సీరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. అతడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో మరో నీచుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైనట్లు సమాచారం.

అన్నాచెల్లెళ్లు, తండ్రీకూతుళ్ల బంధాన్ని కూడా అత్యంత అసభ్యకరంగా వర్ణించడం బాధాకరం అని అంతా వాపోతున్నారు. ప్రణీత్ లాంటి నీచులను అత్యంత కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి.

మరోవైపు ప్రణీత్ హనుమంతు లాంటి నీచుడు తన సినిమా హరోమ్ హరలో నటించినందుకు చింతిస్తున్నట్లు హీరో సుధీర్ బాబు తెలిపారు. చిత్రయూనిట్ తరఫున ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. ప్రణీత్ ఇంత నీచమైన వ్యక్తి అని తమకు తెలియదన్నాడు. ప్రణీత్ కామెంట్స్ ఏ మాత్రం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కిందకు రావన్నారు హీరో సుధీర్ బాబు.

Also Read : ముచ్చుమర్రిలో దారుణం.. భారీగా పోలీసుల మొహరింపు.. అసలేం జరిగింది?