టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణ అరెస్ట్..
బిల్డర్ లింగం గౌడ్ సాయంతో ల్యాండ్ లో పాగా వేశారు.

Producer Sivaramakrishna Arrest : టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. రాయదుర్గంలో ప్రభుత్వ భూమిని కాజేయబోయిన శివరామకృష్ణను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి వేల కోట్ల విలువైన 84 ఎకరాల ల్యాండ్ ను స్వాహా చేసేందుకు శివరామకృష్ణ ప్రయత్నించారు. ఆర్కియాలజీ సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలు సృష్టించి ల్యాండ్ తనదేనంటూ క్లెయిమ్ చేశారు.
బిల్డర్ లింగం గౌడ్ సాయంతో ల్యాండ్ లో పాగా వేశారు. 2003లో అప్పటి ప్రభుత్వం నకిలీ పత్రాలపై కేసు వేసింది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం చేసింది. శివరామకృష్ణ దగ్గర ఉన్నవి నకిలీ పత్రాలేనంటూ సుప్రీంకోర్టు తేల్చడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
టాలీవుడ్ నిర్మాత శివరామకృష్ణను ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి రాయదుర్గంలో ప్రభుత్వానికి సంబంధించిన భూమిని కాజేసేందుకు ఆయన ప్రయత్నించారు. 2003 నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. 84 ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ ను స్వాహా చేసేందుకు శివరామకృష్ణ స్టేట్ ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ నుంచి కొన్ని పత్రాలను సృష్టించారు. ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ సీనియర్ అసిస్టెంట్ కొత్తిని చంద్రశేఖర్ సాయంతో నకిలీ పత్రాలను సృష్టించారు శివరామకృష్ణ. ఆ తర్వాత ఆ ల్యాండ్ తనదేనని క్లెయిమ్ చేశారు. ఇక బిల్డర్ మారగొని లింగం గౌడ్ సాయంతో ల్యాండ్ లో పాగా కూడా వేశారు.
అప్పటి ప్రభుత్వం ఈ నకిలీ పత్రాలపై 2003లో కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం చేసింది. చివరికి శివరామకృష్ణ దగ్గర ఉన్నవి నకిలీ పత్రాలని అత్యున్నత న్యాయస్థానం తేల్చింది. ఈ కేసులో నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని కాజేసేందుకు శివరామకృష్ణ ప్రయత్నించారని సుప్రీంకోర్టు తేల్చడంతో.. ఆయనతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు పోలీసులు. శివరామకృష్ణతో పాటు చంద్రశేఖర్, లింగం గౌడ్ లను అరెస్ట్ చేశారు. ఈ కేసుకి సంబంధించి దర్యాఫ్తు కొనసాగుతోంది.
Also Read : విశాఖ హనీ ట్రాప్ కేసులో మరో సంచలనం.. పరారీలో ఫారెస్ట్ ఆఫీసర్..? గాలిస్తున్న పోలీసులు..!