Covid Patient : కరోనా బాధితుడ్ని చితక్కొట్టిన పోలీసులు.. సస్పెండ్!
కరోనా బాధితుడిని చితకబాదిన ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో ఈ ఘటన జరిగింది. ఖండ్వాలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.

Police Brutally Thrash Covid Patient
Police thrash covid patient : కరోనా బాధితుడిని చితకబాదిన ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో ఈ ఘటన జరిగింది. ఖండ్వాలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు ఆరోగ్య సిబ్బంది వెళ్లారు. హెల్త్ వర్కర్స్‌పై రోగి కుటుంబ సభ్యులు దాడి చేశారు.
దాంతో ఆస్పత్రి సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఖండ్వా చేరుకున్నారు. కరోనా రోగితో పాటు అతని కుటుంబ సభ్యులను పోలీసులు చితకబాదారు. ఈ వీడియోలు సోషల్ మీడియాల్లో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలపై ఖండ్వా ఎస్పీ వివేక్ సింగ్ స్పందించారు. కరోనా రోగిపై దాడి చేసిన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు.