పోలీసులే షాక్..! విశాఖ హనీ ట్రాప్ కేసులో సంచలన విషయాలు..
ఇప్పటికే ఒక్కొక్కరిగా బాధితులు బయటకు వస్తున్నారు.

Visakha Honey Trap Case (Photo Credit : Google)
Vizag Honey Trap Case : విశాఖ హనీ ట్రాప్ కేసులో పోలీసులు కూపీ లాగుతున్నారు. విశాఖలో జరిగిన హనీ ట్రాప్ మూలాలు హైదరాబాద్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. జాయ్ జెమీమా సోషల్ మీడియా ఖాతాలపై నిఘా పెట్టిన పోలీసులు.. కేటుగాళ్లు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి వల వేస్తున్నట్లు గుర్తించారు. యువకులు కనీసం అవతలి వ్యక్తి ఎవరు అనేది కూడా చూడకుండా మేసేజ్ లు చేస్తున్నారు. దీంతో ఈజీగా కేటుగాళ్ల వలలో పడుతున్నారు.
హనీ ట్రాప్ ఉచ్చులో పడ్డ యువకులను బ్లాక్ మెయిల్ చేసి లక్షలు కాజేస్తున్నారు. జాయ్ జెమీమా నగదు లావాదేవీలపైనా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఒక్కొక్కరిగా బాధితులు బయటకు వస్తున్నారు. ఇంకా ఎవరైనా జెమీమా బాధితులు ఉంటే ధైర్యంగా ముందుకు రావాలని పోలీసులు సూచించారు.
ఈ కేసు విచారణలో పోలీసులే షాకయ్యేలా సంచలన వాస్తవలు బయటపడుతున్నాయి. విశాఖలోని షీలా నగర్ కు చెందిన ఓ కుటుంబం కొంత కాలంగా అమెరికాలో ఉంటోంది. ఇన్ స్టాగ్రామ్ ద్వారా వారి కుమారుడితో మురళీనగర్ ఎన్జీవోస్ కాలనీకి చెందిన జాయ్ పరిచయం చేసుకుంది. యువకుడి ద్వారా షీలా నగర్ లోని వారి చిరునామాను తెలుసుకుంది. అతడి తల్లిదండ్రులు షీలా నగర్ ల్ ఉన్న సమయంలో వారి ఇంటికి వెళ్లి కొన్ని రోజుల పాటు మంచి అమ్మాయిలా నటించింది. మీ అబ్బాయి స్నేహితురాలిని అని, పెళ్లి చేసుకుంటానని అడగ్గా.. అతడి తల్లిదండ్రులు నిరాకరించారు. ఆ తర్వాత అమెరికాలో ఉంటున్న బాధిత యువకుడికి మాయమాటలు చెప్పి విశాఖకు రప్పించింది.
ఎయిర్ పోర్టు నుంచే యువకుడిని మురళీనగర్ లోని తన ఇంటికి తీసుకెళ్లి బంధించింది. మత్తు పదార్దాలు కలిపిన జ్యూసులు, డ్రింక్స్ ఇచ్చి మైకంలో ఉన్నప్పుడు శారీరకంగా కలుస్తున్నట్లు ఫొటోలు తీయించింది. వాటితో అతడిని బ్లాక్ మెయిల్ చేసింది. దీంతో కంగారుపడిపోయిన యువకుడు తన తల్లిదండ్రులతో చెప్పి పెళ్లికి ఒప్పిస్తానని చెప్పాడు. అయినా ఆమె వినలేదు. తన సహచరులతో కలిసి యుకుకుడిని తరుచూ బెదిరించేది. ఇటీవల భీమిలిలోని ఒక హోటల్ లో బలవంతంగా నిశితార్థం కూడా చేయించుకుంది. ఆ సమయంలో యుకుకుడితో దాదాపు 5లక్షలు ఖర్చు చేయించింది.
కిలేడీ.. అమాయకులపై వల..
* ధనవంతుల పిల్లలే టార్గెట్
* సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు క్రియేట్
* సోషల్ మీడియా ద్వారా యువకులకు వల
* అమెరికాలో ఉన్న యువకుడిని ట్రాప్ చేసి విశాఖకు రప్పించింది
* యువకులను ట్రాప్ చేసి లక్షలు కాజేస్తున్న ముఠా
Also Read : పవన్ కల్యాణ్.. అదొక పెద్ద క్రైమ్, జాగ్రత్తగా ఉండండి..!- హర్షకుమార్ వార్నింగ్