Jagityala : వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసుల తనిఖీలు-భారీ ఎత్తున నగదు, బంగారం స్వాధీనం

జగిత్యాల జిల్లాలోని  జగిత్యాల,  కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో అనుమతులు లేకుండా ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తుల ఇళ్లలో పోలీసులు నిన్న రాత్రి  ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు

Jagityala : వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసుల తనిఖీలు-భారీ ఎత్తున నగదు, బంగారం స్వాధీనం

Jagityala finance business men

Updated On : January 11, 2022 / 8:30 AM IST

Jagityala : జగిత్యాల జిల్లాలోని  జగిత్యాల,  కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాల్లో అనుమతులు లేకుండా ఫైనాన్స్ వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తుల ఇళ్లలో  పోలీసులు నిన్న రాత్రి  ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో  30,24,800  రూపాయల నగదు, 13  నాన్ జుడిషియల్ బాండ్ పేపర్లు,   272 ప్రామిసరీ నోట్లు,  14 చెక్ బుక్ లు,  54  ఖాళీ చెక్కుల   పుస్తకాలు,  19 వివిధ రకాల సేల్ డీడీ డాక్యుమెంట్స్, వ్యవసాయదారు  పట్టా పాస్ పుస్తకాలు, నాలుగు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Also Read : Road Accident : నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం-ముగ్గురు మృతి

జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ తనిఖీల్లో పలు  డాక్యుమెంట్లను కూడా పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు తమకు ఉన్న అత్యవసర పరిస్థితి దృష్ట్యా అధిక మొత్తంలో వడ్డీకి అప్పులు తీసుకుంటున్నారని….వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులతో   ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని జిల్లా ఎస్పీ శర్మ అన్నారు.   ప్రభుత్వ అనుమతితో   చట్టపరమైన పద్ధతిలోనే వడ్డీవ్యాపారం  చేసే వారిని మాత్రమే నమ్మాలని జిల్లా ఎస్పీ శర్మ ప్రజలకు  విజ్ఞప్తి చేశారు.