భారీగా గోల్డ్ పట్టివేత : కారులో 30 కిలోల బంగారం

పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా బంగారం పట్టుపడింది. కారులో తరలిస్తున్న బంగారు బిస్కెట్లను పోలీసులు పట్టుకున్నారు.

  • Published By: veegamteam ,Published On : March 12, 2019 / 03:52 PM IST
భారీగా గోల్డ్ పట్టివేత : కారులో 30 కిలోల బంగారం

పశ్చిమ గోదావరి జిల్లాలో భారీగా బంగారం పట్టుపడింది. కారులో తరలిస్తున్న బంగారు బిస్కెట్లను పోలీసులు పట్టుకున్నారు.

పశ్చిమ గోదావరి : జిల్లాలో భారీగా బంగారం పట్టుపడింది. కారులో తరలిస్తున్న బంగారు బిస్కెట్లను పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… ఏపీ31డీటీ 7777 నెంబర్ గల ఆడీ కారులో 30 కిలోల బంగారాన్ని విశాఖపట్నం నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. పోలీసులకు అందిన సమాచారంతో జాతీయ రహదారిపై ఉన్న ఉంగుటూరు టోల్‌ ప్లాజా వద్ద గణపవరం సీఐ రామ్‌కుమార్‌ నేతృత్వంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 

ఈ తనిఖీల్లో కారులో 300 బంగారం బిస్కెట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వాటి బరువు ఒక్కొక్కటి 100 గ్రాములు ఉన్నట్లు పేర్కొన్నారు. బంగారానికి సంబంధించిన బిల్లులు ఉండటంతో వాటిని సీఐతోపాటు తహశీల్దార్‌ జీవీఎస్‌ ప్రసాద్‌ పరిశీలించారు. ఆడీ కారును స్వాధీనం చేసుకుని, ఏలూరు ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఎస్పీ ఆధ్వర్యంలో పూర్తి విచారణ చేపట్టి తదుపరి వివరాలు వెల్లడిస్తామని సీఐ పేర్కొన్నారు.