లావణ్య లీలలు.. నార్సింగి డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరం
ఇప్పటికే లావణ్యకు 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. అయితే, 5రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.

Narsingi Drugs Case
Narsingi Drugs Case : నార్సింగి డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాఫ్తు కొనసాగుతోంది. మరోపక్క లావణ్యను కస్టడీకి కోరుతూ పిటిషన్ వేశారు నార్సింగి పోలీసులు. ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. లావణ్యను కస్టడీకి ఇస్తే మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. ఇప్పటికే లావణ్యకు 14 రోజుల రిమాండ్ విధించింది ఉప్పరపల్లి కోర్టు. అయితే, 5రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. సినీనటి లావణ్య నుంచి దాదాపు 4గ్రాముల ఎండీఎంఎను ఎస్వోటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లావణ్యను ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు లావణ్యను చంచల్ గూడ జైలుకి తరలించారు. ఇక, లావణ్యను 5 రోజుల కస్టడీకి కోరుతూ నార్సింగి పోలీసులు ఉప్పర్ పల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై రేపు కోర్టు విచారించే అవకాశం ఉంది. లావణ్యను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
Also Read : నార్సింగి డ్రగ్స్ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు..!
డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారు? ఎవరి దగ్గర కొనుగోలు చేశారు? ఎక్కడెక్కడ డ్రగ్స్ వినియోగించారు? వీటన్నింటిపై లావణ్య నుంచి కూపీ లాగాల్సి అవసరం ఉందంటున్నారు పోలీసులు. లావణ్యతో పాటు మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో లావణ్యతో పాటు మరో మహిళ, వ్యక్తికి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక, లావణ్య కాల్ డేటా, మొబైల్ డేటా, వాట్సాప్ డేటా.. వీటన్నింటిని కూడా పోలీసులు రిట్రైవ్ చేశారు. లావణ్యను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే కచ్చితంగా డ్రగ్స్ కు సంబంధించిన ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
Also Read : పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు..! కట్ చేస్తే దిమ్మతిరిగిపోయే మోసం.. హైదరాబాద్‌లో రూ.500 కోట్ల భారీ ఫ్రాడ్