Narsingi Drug Case : నార్సింగి డ్రగ్స్ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు..!

సంచ‌ల‌నం సృష్టించిన నార్సింగి డ్ర‌గ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీల‌క అంశాలు వెల్ల‌డి అయ్యాయి.

Narsingi Drug Case : నార్సింగి డ్రగ్స్ కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు..!

Updated On : January 30, 2024 / 1:59 PM IST

Narsingi Drug case : సంచ‌ల‌నం సృష్టించిన నార్సింగి డ్ర‌గ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీల‌క అంశాలు వెల్ల‌డి అయ్యాయి. ఇప్ప‌టికే నిందితురాలు లావ‌ణ్య‌ను రిమాండ్‌కు త‌ర‌లించిన సంగ‌తి తెలిసిందే. విజయవాడ నుంచి ఉన్నత చదువులు కోసం లావ‌ణ్య హైదరాబాద్ వ‌చ్చింది. టాలీవుడ్‌లో ఛాన్సుల కోసం ప్ర‌య‌త్నించింది. ఈ క్ర‌మంలోనే మ్యూజిక్ టీచర్ గా పని చేస్తూ చిన్న సినిమాల్లో నటించింది. షార్ట్ ఫిలింలో హీరోయిన్‌గా నటిస్తూ జల్సా లకు అలవాటు ప‌డింది. న‌టించే క్ర‌మంలో ఓ టాలీవుడ్ హీరోతో ఆమెకు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. క్ర‌మంగా అది ప్రేమ‌గా మారింది. లావ‌ణ్య‌.. వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులోనూ అనుమానితురాలుగా ఉంది.

గత కొంతకాలంగా యునిత్ ద్వారా డ్రగ్స్ ని తెప్పించుకుంటుంది. చిత్ర పరిశ్రమలో పలువురికి డ్రగ్స్ సరఫరా చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్ లతో పాటు వ్యక్తిగత చాట్ ని ప‌రిశీలిస్తున్నారు. ఈక్ర‌మంలో ప‌లువురు వీఐపీల‌తో ఆమెకు ప‌రిచ‌యాలు ఉన్న‌ట్లు గుర్తించారు. ఆమెను కోర్టును అనుమ‌తితో క‌స్ట‌డీలోకి తీసుకుంటామ‌ని పోలీసులు చెబుతున్నారు. ఆ త‌రువాత మ‌రిన్ని విష‌యాలు వెల్ల‌డి అయ్యే అవ‌కాశం ఉంది.

Also Read: డ్రగ్స్‌తో పట్టుబడిన టాలీవుడ్‌ హీరో ప్రేయసి.. కోర్టులో హాజరుపరిచిన పోలీసులు..

ఎలా ప‌ట్టుబ‌డిందంటే..?
కోకాపేట్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివ‌సిస్తున్న యువ‌తి డ్ర‌గ్స్ వినియోగిస్తున్న‌ట్లు పోలీసుల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. ఎస్ఓటీ పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని లావ‌ణ్య అనే యువ‌తిని అదుపులోకి తీసుకున్నారు. ఆమె వ‌ద్ద నుంచి 4 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ఆమెను ఉప్ప‌ర్ కోర్టులో హాజ‌రు ప‌రిచారు. న్యాయ‌స్థానం ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది.