Live In Relationship : పెళ్లి పేరుతో సహజీవనం..గర్భం దాల్చే సరికి పరార్

ఉత్తరప్రదేశ్‌లోని బాలియా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని ఒక మహిళతో సహజీవనం చేసిన వ్యక్తి ఆమె గర్భం దాల్చే సరికి మాటమార్చి తప్పించుకు తిరగసాగాడు.

Live In Relationship : పెళ్లి పేరుతో సహజీవనం..గర్భం దాల్చే సరికి పరార్

Live In Partner

Updated On : June 23, 2021 / 3:50 PM IST

Live In Relationship : ఉత్తరప్రదేశ్‌లోని  బాలియా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకుంటానని ఒక మహిళతో సహజీవనం చేసిన వ్యక్తి ఆమె గర్భం దాల్చే సరికి మాటమార్చి తప్పించుకు  తిరగసాగాడు. న్యాయం చేయమని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

బాలియా జిల్లాలో నివసించే 29 ఏళ్ళ యువతికి 2019లో  విజయనగర్‌కు చెందిన అమిత్ మౌర్య పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి ఇద్దరూ సహజీవనం చేయసాగారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి అమిత్ యువతితో సన్నిహితంగా మెలిగాడు.

ఈ క్రమంలో యువతి గర్భం దాల్చింది. అప్పటి నుంచి మౌర్యముఖం చాటేశాడు. ఆమెను పెండ్లి చేసుకోటానికి నిరాకరించాడు. అంతేకాక ఒక అమ్మాయి పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టించి తనకు అశ్లీల చిత్రాలను పంపించేవాడని మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోంది.

యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అమిత్ మౌర్యపై ఐపీసీ, ఐటీ చట్టంలోని సెక్షన్ 376, 506,కింద కేసులు నమోదు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.