30 ఏళ్లుగా దందా : ఆస్పత్రుల్లోని పిల్లలను అమ్మేస్తున్న నర్సు

30 ఏళ్లుగా దందా : ఆస్పత్రుల్లోని పిల్లలను అమ్మేస్తున్న నర్సు

Updated On : April 26, 2019 / 8:09 AM IST

సోషల్ మీడియాలో సంచనంగా మారింది ఓ సీనియర్ వ్యాపారి(మహిళ) ఆఢియో క్లిప్. నర్సుగా పని చేసిన తాను 30 సంవత్సరాలుగా అప్పుడే పుట్టిన పసికందులను అమ్మడం పనిగా పెట్టుకున్నానని నర్సు చెప్పిన మాటలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఆ మాటలపై నిర్థారణ కోసం తమిళనాడుకు చెందిన గ్రామీణ ఆరోగ్య సంరక్షణ శాఖ డైరక్టర్ తమిళనాడు సెక్రటరీ బీలా రాజేశ్‌ను వివరాలు అడిగారు. 

నిందితురాలు మాట్లాడిన ఆడియోను బట్టి ఆమె పదేళ్ల క్రితమే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పీటీఐ కథనం ప్రకారం.. 30 సంవత్సరాలుగా అప్పుడే పుట్టిన పసికందులను ఏ సమస్య లేకుండానే అమ్మేస్తుంది. ఆడ శిశువులను రూ.2.75లక్షలు నుంచి రూ3లక్షలకు అమ్ముతూ.. శిశువులు ఆరోగ్యంగా అందంగా అనిపిస్తే.. రూ.3.75లక్షల నుంచి రూ.4లక్షల వరకూ దండుకునేదంట. 

బాధితుల్లో ఒకరు ఈ ఆడియో క్లిప్ రికార్డు చేయడంతో విషయం బయటకు వచ్చింది. ముందుగా ఆ మహిళ జనన ధ్రువీకరణ పత్రం కోసం రూ.70వేలు చెల్లించమని అడగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చెన్నైలోని రాశిపురం ప్రభుత్వాసుపత్రిలో పని చేసినట్లుగా తెలుస్తోంది. ఇన్నేళ్లుగా చేస్తున్న మోసాలు ఒక గ్యాంగ్‌తో చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అదే కోణంలో విచారణ చేపట్టారు.