136మంది మగాళ్లను రేప్ చేశాడు : అమ్మాయిలే కాదు అబ్బాయిలూ జాగ్రత్త
జాగ్రత్తగా ఉండండి.. మృగాళ్లు ఉంటారు.. అప్రమత్తంగా ఉండండి.. అని ఇంతకాలం అమ్మాయిలకు తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్పడం జరిగింది. కానీ ఇకపై అబ్బాయిలు కూడా

జాగ్రత్తగా ఉండండి.. మృగాళ్లు ఉంటారు.. అప్రమత్తంగా ఉండండి.. అని ఇంతకాలం అమ్మాయిలకు తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్పడం జరిగింది. కానీ ఇకపై అబ్బాయిలు కూడా
జాగ్రత్తగా ఉండండి.. మృగాళ్లు ఉంటారు.. అప్రమత్తంగా ఉండండి.. అని ఇంతకాలం అమ్మాయిలకు తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్పడం జరిగింది. కానీ ఇకపై అబ్బాయిలు కూడా జాగ్రత్తగా ఉండండి అని తల్లిదండ్రులు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అవును.. మగాళ్లకు కూడా రక్షణ కరువైంది. ఓ మగాడు.. 136మంది మగాళ్లను రేప్ చేశాడు. షాకింగ్ గా ఉన్నా, నమ్మలేకున్నా…. ఇది పచ్చి నిజం.
ఇంగ్లండ్ లోని మాంచెస్టర్ లో ఈ ఘటన జరిగింది. అతడి పేరు రెన్ హార్డ్ సినాగా. వయసు 36 ఏళ్లు. ఇండోనేషియాకు చెందిన వాడు. సినాగా ఏకంగా 136 మంది మగాళ్లను రేప్ చేశాడని పోలీసులు తెలిపారు. అతడిని అరెస్ట్ చేసిన బ్రిటన్ పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసు విచారించిన జడ్జి షాక్ కి గురయ్యారు. సినాగాను డేంజరస్ రేపిస్ట్ గా పేర్కొన్నారు. అతనికి 30 ఏళ్ల జీవిత ఖైదు విధించారు.
రెన్ హార్డ్ సినాగా పైకి మంచి వాడిగా నటిస్తూ మగవాళ్లతో స్నేహం చేస్తాడు. ఆ తర్వాత వారికి డ్రగ్స్ ఇస్తాడు. ఆపై రేప్ చేసేవాడని, దాన్నింతా షూట్ చేసేవాడని పోలీసుల విచారణలో తేలింది. సినాగా దగ్గరున్న 3.29 TB డిజిటల్ డైరీ డేటాను పోలీసులు సేకరించారు. దాన్ని విశ్లేషించే పనిలో పడ్డారు.
* సినాగాపై 159 లైంగిక వేధింపుల ఆరోపణలు
* 136 మగాళ్ల రేప్
* సినాగాను విడుదల చేయడం సురక్షితం కాదన్న జడ్జి
* మాంచెస్టర్ క్లబ్ లోని తన ఫ్లాట్ లో అత్యాచారాలు
* డ్రగ్స్ ఇచ్చి దారుణాలు.. ఆపై షూట్
* 190 మంది బాధితులు
* ఇప్పటికే 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు
* లీడ్స్ వర్సీటీలో PHD చేస్తున్న సినాగా.. కొన్నేళ్లుగా దురాఘతాలు
* 2017 జూన్ లో అరెస్ట్
* తాము రేప్ కు గురైనట్టు చాలామంది బాధితులకు తెలియదన్న పోలీసులు