నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్ వాసుల మృతి

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు హైదరాబాద్ వాసుల మృతి

Nandyala Road Accident

Nandyal District Road Accident : నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నవ దంపతులతో పాటు ఐదుగురు మృతి చెందారు. బుధవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల వద్ద హైవేపై నెమ్మదిగా వెళ్తున్న లారీని వెనుకాల వేగంగా వచ్చిన కారు ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. వీరంతా కారులో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి వస్తున్నారు. మృతులంతా హైదరాబాద్ సికింద్రాబాద్ లోని వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

Also Read : Magic Box Fraud : ఇదో అద్భుత మహిమల పెట్టె, రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారు..! కట్ చేస్తే..

సికింద్రాబాద్ అల్వాల్ సమీపంలోని వెస్ట్ వెంకటాపురం ప్రాంతానికి చెందిన రవీందర్ రెడ్డి కుమారుడు బాల కిరణ్ కు గతనెల 29న గుంటూరు జిల్లా తెనాలికి చెందిన కావ్యతో వివాహం జరిగింది. ఈనెల 3న శామీర్ పేటలో ఘనంగా రిసెప్షన్ జరిపించారు. 4వ తేదీన నూతన దంపతులతో పాటు రవీందర్, అతని భార్య లక్ష్మీ కారులో తిరుమల దర్శనానికి వెళ్లారు. తిరుమలలో స్వామివారి దర్శనం అనంతరం రాత్రి హైదరాబాద్ కు బయలుదేరారు. నంద్యాల జిల్లా నల్లగట్ల వద్ద హైవేపై నెమ్మదిగా వెళ్తున్న లారీని వెనకాల నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవీందర్, అతని భార్య లక్ష్మీ, నవదంపతులు బాల కిరణ్, కావ్య, రవీందర్ మరో కుమారుడు ఉదయ్ కిరణ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.

Road Accident

Road Accident

కారు వేగంగా ప్రయాణిస్తుండటంతోపాటు, కారు నడుపుతున్న వ్యక్తి నిద్రమత్తు కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకొని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.