Magic Box Fraud : ఇదో అద్భుత మహిమల పెట్టె, రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారు..! కట్ చేస్తే..

అలీబాబా అద్భుత దీపం వంటి కథలను పుస్తకాల్లో చదివాం. సినిమాల్లో మాత్రమే చూశాం. కానీ, నిజ జీవితంలో అమాయకులను మోసం చేసేందుకు మంత్రపు పెట్టెకు అద్భుత శక్తుల ఉన్నాయని నమ్మించి మోసం చేయటానికి ఓ గ్యాంగ్ సిద్ధమైంది.

Magic Box Fraud : ఇదో అద్భుత మహిమల పెట్టె, రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతారు..! కట్ చేస్తే..

Magic Box Fraud : మోసపోయే వారు ఉన్నంత కాలం మోసం చేసే వాళ్లు పుడుతూనే ఉంటారు. అతీత శక్తులు ఉన్నాయంటూ అభూత కల్పన సృష్టించి కొందరు కేటుగాళ్లు అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. రైస్ పుల్లింగ్ చేస్తే అతీతమైన శక్తి సొంతం అవుతుందని ఒకరు, పురాతన వస్తువులు ఇంట్లో పెట్టుకుంటే ధనవంతులు అవుతారని మరొకరు.. ఇలా సినిమాల్లో చూపిన సీన్లను కొందరు కేటుగాళ్లు రియల్ లైఫ్ లో అమాయకులపై ప్రయోగిస్తున్నారు.

కోట్ల రూపాయల డబ్బులను సొంతం చేసుకోవాలనే అత్యాశకు పోయి అమాయకులు చివరకు ఆ కేటుగాళ్ల చేతిలో బలైపోతున్నారు. నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నా.. కొందరు జనాల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే జనగామలో చోటు చేసుకుంది.

మంత్రపు పెట్టెకు అద్భుత శక్తులు ఉన్నాయంటూ..
అలీబాబా అద్భుత దీపం వంటి కథలను పుస్తకాల్లో చదివాం. సినిమాల్లో మాత్రమే చూశాం. కానీ, నిజ జీవితంలో అమాయకులను మోసం చేసేందుకు మంత్రపు పెట్టెకు అద్భుత శక్తులు ఉన్నాయని నమ్మించి మోసం చేయటానికి ఓ గ్యాంగ్ సిద్ధమైంది. తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్న నలుగురు ఓ ముఠాగా ఏర్పడ్డారు. అమాయకులను మోసం చేసేందుకు పథకం రూపొందించారు.

Also Read : ఒంటరి మహిళలు, వృద్ధులు జాగ్రత్త..! హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన, ఇంట్లోకి దూరిన అపరిచితుడు

మంత్రపు పెట్టె.. 50కోట్లకు అమ్మేందుకు డీల్..
పిడుగులు పడినప్పుడు వచ్చే మెటల్ తో తయారు చేసిన పెట్టె.. తమ వద్ద ఉందని, ఆ పెట్టెకు దివ్య శక్తులు ఉన్నాయని, అది ఎవరి దగ్గర ఉంటుందో వారికి అదృష్టం కలిసొచ్చి కోటీశ్వరులు అవుతారని మాయ మాటలు చెప్పారు. ఆ పెట్టెను వరంగల్ కు చెందిన ఓ వ్యక్తికి 50కోట్లకు విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇందుకోసం హైదరాబాద్ నుంచి ఆటోలో వరంగల్ కు బయలుదేరింది ఆ ముఠా. ఇక్కడి వరకు ఆ ముఠా ఆటలు బాగానే సాగాయి. తాము అనుకున్న ప్లాన్ పక్కాగా అమలు చేసుకుంటూ వచ్చారు. మరో 50 కిలోమీటర్లు వెళ్తే 50 కోట్ల దక్కుతాయనే ఆశలో ఉన్నారు. కానీ, ఇక్కడే సీన్ రివర్స్ అయ్యింది. పోలీసుల ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది.

పోలీసుల విచారణలో బయటపడిన నిజం..
జనగామ మండలం పెంబర్తి వై జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. వారిని చూసిన ముఠా ఆటోను వెనక్కి తిప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఇది గమనించిన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. ఆటోలో ఉన్న వ్యక్తుల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు తమదైన స్టైల్ లో వారిని విచారించగా.. అసలు విషయం కక్కేశారు.

మోసగాళ్లతో బీకేర్ ఫుల్ అంటున్న పోలీసులు..
ఏసీపీ దామోదర్ రెడ్డి ముఠా మోసాలను వివరించారు. అది మంత్రపు పెట్టె కాదు సాధారణ పెట్టె అని తేల్చారు. పెట్టె కింది భాగంలో బ్యాటరీ వంటిది అమర్చి దానిపై అయస్కాంతం పెట్టగానే వైబ్రేషన్ వచ్చేలా, ఇనుపు వస్తువుతో రాయగానే నిప్పురవ్వల మాదిరిగా స్పార్స్క్ వచ్చేలా చేశారు. వీటిని తయారు చేయించి వాటిని పలువురికి విక్రయించి మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Also Read : మహా ముదుర్లు.. అక్షరం ముక్క రాకపోయినా యూట్యూబ్‌లో చూసి దొంగతనాలు.. 500కిపైగా కార్లు చోరీ