బంజారాహిల్స్ లో రౌడీషీటర్‌ దారుణ హత్య

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఓ రౌడీ షీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు అతడిని వెంటాడి నరికి చంపారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని ఎన్‌బీటీ నగర్‌లో ఈ మర్డర్‌

  • Published By: veegamteam ,Published On : December 13, 2019 / 02:20 AM IST
బంజారాహిల్స్ లో రౌడీషీటర్‌ దారుణ హత్య

Updated On : December 13, 2019 / 2:20 AM IST

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఓ రౌడీ షీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు అతడిని వెంటాడి నరికి చంపారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని ఎన్‌బీటీ నగర్‌లో ఈ మర్డర్‌

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో ఓ రౌడీ షీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు అతడిని వెంటాడి నరికి చంపారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని ఎన్‌బీటీ నగర్‌లో ఈ మర్డర్‌ జరిగింది. మృతుడు రౌడీషీటర్‌ నూర్‌ సయ్యద్‌గా పోలీసులు గుర్తించారు.

రౌడీషీటర్‌ నూర్‌ సయ్యద్‌ గోల్కొండ పరిధిలో నివసిస్తున్నాడు. డిసెంబర్ 12వ తేదీ రాత్రి 8 గంటల ప్రాంతంలో బైక్ పై వెళ్తుండగా… ఎన్‌బీటీ నగర్‌ దగ్గర ప్రత్యర్థులు కత్తులతో విరుచుకుపడ్డారు. ఆటో స్టాండ్ దగ్గర అతడి కోసం కాపుకాసిన ప్రత్యర్థులు ఒక్కసారిగా సయ్యద్‌పై దాడికి దిగారు. నలుగురు యువకులు కత్తులతో అటాక్ చేశారు. నూర్‌ సయ్యద్‌ పరుగెడుతున్నా వదిలిపెట్టలేదు. అతడి ముఖం, మెడ, ఛాతిపై తీవ్రంగా పొడిచారు. దీంతో సయ్యద్‌ రక్తపుమడుగులో కుప్పకూలిపోయాడు. స్పాట్‌లోనే ప్రాణాలు వదిలాడు. 

నూర్‌ సయ్యద్ హత్య అనంతరం నలుగురు యువకులు పీఎస్‌కు పరుగుతీశారు. నేరుగా బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. నిందితులంతా 25ఏళ్ల లోపు యువకులే. ఘటనాస్థలంలో రెండు కత్తులు, బైక్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్‌, బంజారాహిల్స్ ఏసీపీ కెఎస్ రావు, ఇన్‌స్పెక్టర్‌ కళింగరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. నిందితులపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.