ఛీ..ఛీ.. స్కూల్‌లో ప్రిన్సిపల్ పాడు పని, మహిళా టీచర్‌తో అలా..

స్కూల్ అంటే దేవాలయంతో సమానం అంటారు, అలాంటి చోట ఇలాంటి పనులకు పాల్పడటం ఏంటని తిడుతున్నారు.

ఛీ..ఛీ.. స్కూల్‌లో ప్రిన్సిపల్ పాడు పని, మహిళా టీచర్‌తో అలా..

School Principal With Teacher (Photo Credit : Google)

Updated On : July 8, 2024 / 11:05 PM IST

Obscene Act : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారు సన్మార్గంలో వెళ్లేలా చూడాల్సిన గురువే దారితప్పాడు. ఉపాధ్యాయ వృత్తికి కళంకం తెచ్చేలా వ్యవహరించాడు. కామంతో కళ్లు మూసుకుపోయి నీచంగా వ్యవహరించాడు. పాఠశాలను ఎంతో పవిత్రంగా చూస్తారు, దేవాలయంగా భావిస్తారు. అలాంటి స్కూల్ లోనే ఓ ప్రిన్సిపల్ బరి తెగించాడు. లేడీ టీచర్ తో రాసలీలలు సాగించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జౌన్ పూర్ లోని కాన్వెంట్ స్కూల్ లో ఈ షాకింగ్ ఘటన జరిగింది. స్కూల్ ప్రిన్సిపల్ తన గదిలో మహిళా టీచర్ తో రొమాన్స్ చేశాడు. ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. ముద్దులు పెట్టాడు. అసభ్యకర చేష్టలకు పాల్పడ్డాడు. ప్రిన్సిపల్ గదిలోనే ఇదంతా జరిగింది. పైగా ఆ గదిలో పలువురు మహనీయులు ఫోటోలు కూడా ఉన్నాయి. అయినా వారిద్దరూ అస్సలు తగ్గలేదు. తమ పని తాము కానిచ్చారు.

లేడీ టీచర్ తో ప్రిన్సిపల్ రొమాన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఇది చూసి అంతా మండిపడుతున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువులే ఇలా దారి తప్పితే ఎలా అంటున్నారు. స్కూల్ అంటే దేవాలయంతో సమానం అంటారు, అలాంటి చోట ఇలాంటి పనులకు పాల్పడటం ఏంటని తిడుతున్నారు. ప్రిన్సిపల్, లేడీ టీచర్ తీరుతో విద్యార్థుల తల్లిదండ్రులు విస్తుపోయారు. ఇలాంటి వాళ్లు తమ పిల్లలకు ఏం చదువు చెబుతారని ప్రశ్నిస్తున్నారు. పిల్లలకు ఆదర్శంగా నిలవాల్సిన గురువులే ఇలా దిగజారిపోతే ఎలా అని నిలదీస్తున్నారు. కోరికలు తీర్చుకోవడానికి వారికి మరో చోటే దొరకలేదా? అని సీరియస్ అవుతున్నాడు. కామంతో కళ్లు మూసుకుపోయి స్కూల్ లోనే రాసలీలకు దిగిన ప్రిన్సిపల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు.

Also Read : పెళ్లిళ్లలో హాఫ్ సెంచరీ..! ఏకంగా 50మందిని పెళ్లి చేసుకుంది, చివరికి ఆధార్ కార్డుతో అడ్డంగా దొరికిపోయింది..