Scottish Hiker : ఢిల్లీలో గార్మిన్ ఇన్‌రీచ్ జీపీఎస్ డివైజ్‌తో పట్టుబడ్డ స్కాట్లాండ్ హైకర్.. జీపీఎస్ డివైజ్ ఏంటి? భారత్‌లో ఎందుకు నిషేధించారంటే?

Scottish Hiker : భారత్‌కు వెళ్లే సమయంలో శాటిలైట్ కమ్యూనికేటర్ వంటి ఏ జీపీఎస్ డివైజ్ తీసుకురావద్దని ఆమె తన పోస్ట్‌లో విజ్ఞప్తి చేశారు. అలాంటి పరికరాలు ఇక్కడ చట్టవిరుద్ధమని ఆమె చెప్పుకొచ్చింది.

Scottish Hiker : ఢిల్లీలో గార్మిన్ ఇన్‌రీచ్ జీపీఎస్ డివైజ్‌తో పట్టుబడ్డ స్కాట్లాండ్ హైకర్.. జీపీఎస్ డివైజ్ ఏంటి? భారత్‌లో ఎందుకు నిషేధించారంటే?

Scottish hiker detained in New Delhi (Image Source : Google )

Updated On : January 3, 2025 / 7:26 PM IST

Scottish Hiker : ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్కాట్లాండ్ మహిళను అదుపులోకి తీసుకున్నారు. భారత్‌లో నిషేధిత జీపీఎస్ డివైజ్‌ను తీసుకువెళుతుండగా హీథర్ అనే హైకర్ ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బందికి పట్టుబడింది. తనకు ఎదురైన ఈ అనుభవాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా హీథర్ వివరించింది. “ఇక్కడ ఈ స్విస్ ఆధారిత జీపీఎస్ డివైజ్ చట్టవిరుద్ధం” శాటిలైట్ కమ్యూనికేటర్‌లు లేదా గార్మిన్ ఇన్ రీచ్ వంటి డివైజ్‌లను భారతదేశానికి తీసుకురావద్దని తోటి ప్రయాణికులకు సలహా ఇచ్చింది. అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..

రిషికేశ్ వెళ్తుండగా పట్టుబడిన హీథర్ :
హీథర్ రిషికేశ్ వెళ్తున్న సమయంలో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగానే సెక్యూరిటీ సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. అనంతరం ఆమెను పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత హీథర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇతర ప్రయాణికులకు అనేక సూచనలు చేసింది. జీపీఎస్ డివైజ్‌లు లేదా శాటిలైట్ కమ్యూనికేటర్స్ వంటి ఇతర పరికరాలను భారత్‌కు తీసుకురావద్దని అభ్యర్థిస్తూ ఒక పోస్ట్ చేసింది. భారత్‌కు వెళ్లే సమయంలో శాటిలైట్ కమ్యూనికేటర్ వంటి ఏ డివైజ్ తీసుకురావద్దని ఆమె తన పోస్ట్‌లో విజ్ఞప్తి చేశారు. అలాంటి పరికరాలు ఇక్కడ చట్టవిరుద్ధమని ఆమె చెప్పుకొచ్చింది.

Read Also : Blinkit Ambulance : బ్లింకిట్ సరికొత్త ఎమర్జెన్సీ సర్వీసు.. ఇకపై కేవలం 10 నిమిషాల్లోనే అంబులెన్స్..!

పోలీసులు నాకు నీళ్లు కూడా ఇవ్వలేదు :
తాను రాయబార కార్యాలయాన్ని కూడా సంప్రదించినట్లు హీథర్ పోస్ట్‌లో పేర్కొంది. తాము ఏమీ చేయలేమని రాయబార కార్యాలయం చెప్పిందని ఆమె అన్నారు. ఇదంతా భారత్ చట్టం చేతుల్లో ఉందని అన్నారని వాపోయింది. తాను పోలీసు అదుపులో ఉన్నప్పుడు కనీసం తనకు తాగడానికి నీరు కూడా ఇవ్వలేదని హీథర్ ఆవేదనను వ్యక్తపరించింది.

Scottish hiker detained in New Delhi

Scottish hiker detained

భద్రతా సిబ్బంది నన్ను పక్కకు లాగారు :
‘రాత్రి 10.30 గంటలకు రిషికేశ్‌కు అంతర్గత విమానంలో వెళ్లాలని ఢిల్లీ విమానాశ్రయంలో వెళ్తున్నట్లు హీథర్ తన పోస్ట్‌లో రాశారు. నేను అనుకోకుండా స్కానర్ గుండా వెళ్ళడానికి ట్రేలో నా గార్మిన్ ఇన్‌రీచ్‌ని ఉంచాను. ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది పరుగున వచ్చి నన్ను వెంటనే పక్కకు లాగారు. ఆ తర్వాత నన్ను వేచి ఉండమని అడిగారు’ అని తెలిపింది.

పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ :
తనను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. చాలా గంటలపాటు నిర్బంధించిన తర్వాత రాత్రి 9 గంటలకు తనను పోలీసు కస్టడీ నుంచి విడుదల చేశారని హీథర్ పేర్కొన్నారు. ఈ సమయంలో తనను డాక్యుమెంట్‌పై సంతకం చేయమని అడిగారు. కానీ, తాను ఏం మాట్లాడలేదని తెలిపింది. కోర్టుకు హాజరు కావాలనే షరతుపై తనను పోలీసులు విడిచిపెట్టారని హీథర్ తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది.

“ఈ చట్టానికి బలి అయిన వ్యక్తి నేను మాత్రమే కాదు. అందుకే, నేను ఈ పోస్ట్ పెట్టాల్సి వచ్చింది”అని ఆమె పేర్కొంది. గత డిసెంబరులో భారత్‌కు ఇలాంటి పరికరాన్ని తీసుకెళ్లినందుకు అరెస్టయిన కెనడియన్ రన్నర్‌కు సంబంధించిన ఇటీవలి కేసును హీథర్ ప్రస్తావించింది.

గార్మిన్ ఇన్‌రీచ్ అంటే ఏంటి? :
గార్మిన్ ఇన్ రీచ్ అనేది స్విస్ ఆధారిత పాపులర్ జీపీఎస్ శాటిలైట్ మెసేజ్ డివైజ్. ఈ డివైజ్‌ను తరచుగా బ్యాక్‌ప్యాకర్లు, అధిరోహకులు ఉపయోగిస్తారు. కంపెనీ వెబ్‌సైట్‌లో “శాటిలైట్ కమ్యూనికేటర్‌ను ఉపయోగించడం నిషేధించే దేశాల్లో యూఎస్ ఆంక్షలు విధించే 14 దేశాలలో భారత్ కూడా ఒకటి. ఈ డివైజ్ నిషేధించిన ఇతర దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్, ఉక్రేనియన్ క్రిమియా, క్యూబా, జార్జియా, ఇరాన్, ఉత్తర కొరియా, మయన్మార్, సూడాన్, సిరియా, థాయిలాండ్, వియత్నాం, చైనా, రష్యా ఉన్నాయి. మోడ్రాన్ సెల్‌ఫోన్‌లలో డైరెక్ట్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్లు ప్రస్తుతం సర్వసాధారణంగా మారాయి. శాటిలైట్ కమ్యూనికేషన్ ద్వారా ఐఫోన్ యూజర్లు తమ గ్రిడ్‌లో ఉన్నప్పుడు సెల్యులార్ లేదా వై-ఫై కనెక్టివిటీ లేకుండా ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లను సంప్రదించవచ్చు. వారి లొకేషన్ షేర్ చేయొచ్చు. ఎవర్జెన్సీ సేవలకు మెసేజ్‌లను పంపవచ్చు.

భారత్‌లో ఎందుకు నిషేధించారంటే? :
శాటిలైట్ సమాచార మార్పిడిపై నిషేధం 1885 నాటి ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం, 1933 వైర్‌లెస్ టెలిగ్రాఫీ చట్టంతో అమల్లోకి వచ్చింది. గ్లోబల్ రెస్క్యూ, గ్లోబల్ మెడికల్ అండ్ సెక్యూరిటీ ఇవాకేషన్ సర్వీసు ప్రకారం.. 2008 ముంబై టెర్రర్ దాడుల సమయంలో ఈ పాత నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇందులో ఒక ఉగ్రవాద గ్రూపు బాంబు దాడులు, కాల్పులకు ప్లాన్ చేసేందుకు శాటిలైట్ కమ్యూనికేటర్లను నియమించింది. టైమ్స్ నౌ ప్రకారం.. భద్రతాపరమైన ప్రమాదాలు, చట్టవిరుద్ధమైన నిఘాను నివారించడానికి ఫోన్‌లు, ఇతర కమ్యూనికేషన్ పరికరాల వంటి శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీని అక్రమంగా ఉపయోగించడాన్ని భారత్ నిషేధించింది. ఈ పరికరాలు స్మగ్లింగ్, గూఢచర్యం లేదా సున్నితమైన ప్రదేశాలలో కమ్యూనికేషన్ పరిమితులను అధిగమించడం వంటి ప్రమాదకరమైన లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు ఉపయోగించవచ్చు.

గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయా? :
డిసెంబర్ 6న గోవాలోని డబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కెనడాకు చెందిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. టీనా లూయిస్ గార్మిన్ జీపీఎస్ డివైజ్ ఉపయోగించి కొచ్చికి ప్రయాణిస్తున్నారు. ఆమె జీపీఎస్ డివైజ్ స్కానింగ్ ట్రేలో ఉంచిన తర్వాత సెక్యూరిటీ ఆమెను ప్రశ్నించింది. సాయుధ గార్డులు ఆమెను లైన్ నుంచి ఎస్కార్ట్ చేశారు. 51 ఏళ్ల ఆమెను నాలుగు గంటల పాటు నిర్బంధించారు. ఆపై డివైజ్ గురించి ప్రశ్నించారు. దాంతో ఆమె పర్యటన ఆగిపోయింది. ఆమెకు 11 డాలర్ల జరిమానా మాత్రమే విధించబడినప్పటికీ, ఆమె బెయిల్, లీగల్ ఫీజులలో 2వేల డాలర్ల కన్నా ఎక్కువ చెల్లించవలసి వచ్చింది.

పీటీఐ ప్రకారం.. ఇదే విధమైన మరొక సంఘటన జరిగింది. గార్మిన్ ఎడ్జ్ 540 జీపీఎస్ పరికరాన్ని తీసుకువెళ్లినట్లు ఆరోపించినందుకు డిసెంబరు 9న ఒక చెక్ జాతీయుడు గోవాలో పట్టుబడ్డాడు. నార్త్ గోవాలోని మోపాలోని మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పరీక్షిస్తున్నప్పుడు నిషేధిత డివైజ్ గుర్తించారు. దాంతో మార్టిన్ పోలెస్నీపై అభియోగాలు మోపారు. ఇండియన్ వైర్‌లెస్ టెలిగ్రాఫీ యాక్ట్ 1933 ప్రకారం.. గోవా పోలీసుల ముందు హాజరుకావాలని నోటీసు ఇచ్చారు. ఇదే కారణంతో నెల రోజుల క్రితం మరో అమెరికన్‌ని చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.

Read Also : HMVP Virus : చైనాను వణికిస్తున్న మరో మహమ్మారి..! HMVP వైరస్ అంటే ఏమిటి? లక్షణాలు ఏంటి?