Karnataka Liquor Seized : అనంతలో భారీగా కర్ణాటక మద్యం స్వాధీనం
కర్ణాటక నుంచి ఏపీకి తీసుకు వస్తున్న అక్రమ మద్యాన్ని అనంతపురం జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు.

Karnataka Liquor Seized
Karnataka Liquor Seized : కర్ణాటక నుంచి ఏపీకి తీసుకు వస్తున్న అక్రమ మద్యాన్ని అనంతపురం జిల్లాలో పోలీసులు పట్టుకున్నారు. పోలీసులకు అందిన సమచారం మేరకు (స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో) సెబ్ పోలీసులు పెనుకొండ మండలం కొండంపల్లి- శెట్టిపల్లి గ్రామాల మధ్య ఈరోజు ఉదయం తనిఖీలు నిర్వహించారు.
Also Read : Love Tragedy : మూడేళ్ల ప్రేమాయణం….ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడు
ఈ తనిఖీల్లో టాటా ఏస్ వాహనంలో తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి వద్దనుంచి 16,320 టెట్రా పాకెట్లు (170 బాక్సులు), టాటా ఏస్ వాహనం, కారు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని, నిందితులను తదుపరి విచారణ నిమిత్తం పెనుకొండ పోలీసు స్టేషన్ లో అప్పగించారు.