Naresh filed a complaint : 10 కోట్లు మోసం… న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన సీనియర్ నటుడు నరేష్

తమతో కలిసి వ్యాపారం చేసే వ్యక్తి హ్యండ్ లోన్ కింద రూ.7.5 కోట్లు తీసుకుని ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Naresh filed a complaint : 10 కోట్లు మోసం… న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన సీనియర్ నటుడు నరేష్

Naresh Complaint On Key Stone

Updated On : April 18, 2021 / 4:16 PM IST

Senior actor naresh filed a complaint on Keystone infra company : తమతో కలిసి వ్యాపారం చేసే వ్యక్తి హ్యండ్ లోన్ కింద రూ.7.5 కోట్లు తీసుకుని ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. లింగం శ్రీనివాస్ అనే వ్యక్తి కీస్టోన్ ఇన్ఫ్రా కంపెనీతో సహా రెండు మూడు సంస్ధలను స్ధాపించాడు.

మా బిల్డర్‌ ఫినిక్స్‌తో ఈయన అసోసియేట్‌ అయ్యి సైనింగ్ అథారిటీలో ఉన్నారు. ఈయన మా ఫ్యామిలీ దగ్గర ఆరేళ్ల ముందు దాదాపు ఏడున్నర కోట్ల రూపాయలు అప్పుగా తీసుకున్నారు. మా మేనమామ రఘునాథ్‌ ద్వారా అప్పు తీసుకున్నారు. ఇన్నేళ్లు మాకు ఎటువంటి రిటర్న్స్‌ కూడా ఇవ్వలేదు.

డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతుంటే ఇవ్వకుండా తప్పించుకుతిరుగుతున్నాడని నరేష్ ఆరోపించారు. మేం చాలా ఇబ్బంది పడ్డాం. కరోనా టైం లో బాగా ఇబ్బందులు పడటంతో … నేను సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులో కూడా అప్రోచ్‌ అయ్యాను అని చెప్పారు.

గతంలో ఒకసారి డబ్బులు ఇస్తానని చెప్పి విజయవాడ రప్పించి అక్కడ కనపడకుండా మోసం చేశాడని తెలిపారు. ఇప్పుడు దాదాపు పదికోట్ల రూపాయలకు పైగానే మాకు రావాలి. తెలంగాణ పోలీసులు, సెంట్రల్‌ క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌వారు వెంటనే స్పందించారు. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అన్నారు. నరేష్ ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.