వరంగల్‌లో సీనియర్ జర్నలిస్ట్ దారుణ హత్య

వరంగల్‌లో సీనియర్ జర్నలిస్ట్.. బొమ్మినేని సునీల్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలోని పస్రా పట్టణంలో ఒక బేకరీ ముందు ఫొటో జర్నలిస్టు సునీల్ రెడ్డి,

  • Published By: veegamteam ,Published On : March 3, 2020 / 02:40 AM IST
వరంగల్‌లో సీనియర్ జర్నలిస్ట్ దారుణ హత్య

Updated On : March 3, 2020 / 2:40 AM IST

వరంగల్‌లో సీనియర్ జర్నలిస్ట్.. బొమ్మినేని సునీల్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలోని పస్రా పట్టణంలో ఒక బేకరీ ముందు ఫొటో జర్నలిస్టు సునీల్ రెడ్డి,

వరంగల్‌లో సీనియర్ జర్నలిస్ట్.. బొమ్మినేని సునీల్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలోని పస్రా పట్టణంలో ఒక బేకరీ ముందు ఫొటో జర్నలిస్టు సునీల్ రెడ్డి, ఆయన స్నేహితుడు దేవేందర్ రెడ్డిపై దుండగులు దాడి చేశారు. సోమవారం(మార్చి 2,2020) అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. స్నేహితుడికి రావాల్సిన డబ్బుల కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్లి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పథకం ప్రకారమే:
ఫొటో జర్నలిస్టు సునీల్ రెడ్డి వరంగల్ ప్రెస్ క్లబ్ కోశాధికారిగా ఉన్నారు. సునీల్ రెడ్డి దారుణ హత్యతో జర్నలిస్ట్ సంఘాలు షాక్ కి గురయ్యాయి. దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. సునీల్ రెడ్డి హత్యను జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. పథకం ప్రకారమే దుండగులు సునీల్ రెడ్డిని హత్య చేశారని ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. పాత బాకీ విషయంలో గొడవడే దీనికి కారణమని తెలుస్తోంది. 

హత్యకు కారణం ఇదే:
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దయ అనే వ్యక్తి బేకరీ పెట్టుకోడానికి కృష్ణా రెడ్డి అనే వ్యక్తి దగ్గర రూ. 8 లక్షల అప్పు తీసుకున్నాడు. సకాలంలో చెల్లించకపోవడంతో కృష్ణారెడ్డి తన మిత్రుడైన సునీల్ రెడ్డికి విషయం చెప్పాడు. సునీల్‌తో కలిసి అప్పు వసూలు చేయడానికి పస్రా పట్టణం వెళ్లాడు. బేకరీ యజమాని దయ తన తమ్ముడితో కలిసి సునీల్, కృష్ణారెడ్డిలపై కత్తులతో దాడి చేశారు. సునీల్ రెడ్డి అక్కడిక్కడే మృతి చెందగా.. ఆయన స్నేహితుడు కృష్ణారెడ్డికి తీవ్ర గాయాలు అయ్యాయి. కృష్ణారెడ్డిని చికిత్స కోసం వరంగల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో జర్నలిస్టు సంఘాలు ఉలిక్కిపడ్డాయి.