లాక్ డౌన్ : సొంతూళ్లకు వెళ్తుండగా ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం…ఆరుగురు కూలీలు దుర్మరణం
రంగారెడ్డి జిల్లాలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందారు.

రంగారెడ్డి జిల్లాలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందారు.
రంగారెడ్డి జిల్లాలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ సమీపంలోని పెద్ద గోల్కొండ వద్ద బొలెరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఘటనాస్థలంలో ఐదుగురు మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మృతులు కర్నాటకకు చెందిన కూలీలుగా గుర్తించారు. కరోనా వల్ల పనులు నిలిచిపోవడంతో సొంత గ్రామాలకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
కర్నాటకకు చెందిన కొంతమంది కూలీలు ఉపాధి కోసం కొన్నాళ్ల క్రితం సూర్యపేటకు వచ్చారు. కరోనా నేపథ్యంలో తెలంగాణ లాక్ డౌన్ నడుస్తోంది. దీంతో కంపెనీలు మూతపడ్డాయి. కూలీ పనులు కూడా బంద్ అయ్యాయి. దీంతో దాదాపు 30 మంది రాత్రి బొలేరో వాహనంలో కర్నాటకలోని రాయిచూర్ కు తిరుగు ప్రయాణం అయ్యారు.
పెద్ద గోల్కండ సమీపానికి రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ ఓవర్ టేక్ చేయబోయి కూలీలతో వెళ్తున్న బొలేరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనం నుజ్జు అయింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్నారు.
స్పాట్ లోనే చనిపోయిన ఐదుగురి మృత దేహాలను ఉస్మానియా హాస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో నలుగురి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు.