ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఏడుగురు మృతి

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ హైవేపై వేగంగా దూసుకొచ్చిన బస్సు ఓ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 34 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.
సమాచారం తెలుసుకున్న పోలీసుల సంఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.