గంగానదిలో పడవ మునిగి 100మంది గల్లంతు

  • Published By: venkaiahnaidu ,Published On : November 5, 2020 / 12:32 PM IST
గంగానదిలో పడవ మునిగి 100మంది గల్లంతు

Updated On : November 5, 2020 / 12:54 PM IST

బీహార్‌ లో జరిగిన ఓ పడవ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ఇవాళ ఉదయం భగల్ పూర్ జిల్లాలో గంగానదిలో 100 మందికిపైగా రైతులు, కూలీల‌తో వెళ్తున్న ఓ ప‌డ‌వ మునిగిపోయింది. నౌ గచ్చియా ప్రాంతంలో ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. సామ‌ర్థ్యానికి మించి ప‌డ‌వ‌లో కూలీల‌ను, రైతుల‌ను ఎక్కించ‌డ‌మే కాకుండా.. సైకిళ్లు, బైక్‌ లతో న‌దిని దాటే క్ర‌మంలో ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు.



ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టి వ‌ర‌కు 10 మంది మృత‌దేహాల‌ను వెలికితీశారు. మ‌రో 15 మంది దాకా ఈత కొడుతూ ఒడ్డుకు చేరారు. గ‌ల్లంతైన వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. బాధిత కుటుంబాల స‌భ్యులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.
https://10tv.in/new-twist-in-kadapa-road-accident/