Shamshabad Airport : పైకేమో సెంట్‌బాటిల్స్, ఆటబొమ్మలు.. లోపలేమో బంగారం.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా గోల్డ్ సీజ్
Shamshabad Airport: బంగారాన్ని సెంట్ బాటిళ్లు, పిల్లలు ఆడుకునే వస్తువుల్లో దాచి తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Shamshabad Airport
Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కి వచ్చిన ఇద్దరి నుంచి సుమారు 58లక్షల విలువ చేసే బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని సెంట్ బాటిళ్లు, పిల్లలు ఆడుకునే వస్తువుల్లో దాచి తరలిస్తుండగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న ముఠాను మరోసారి అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి గోల్డ్ తీసుకొచ్చి హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేశారు. బంగారం బరువు 953 గ్రాములు ఉంటుదని లెక్కట్టారు. ఎవరి కంటా పడకుండా గోల్డ్ స్మగ్లింగ్ చేయాలని చూశారు.
Also Read..Viral Video : ఓ మై గాడ్.. రెచ్చిపోయిన దొంగలు, క్షణాల్లో బైకులు చోరీ.. వీడియో వైరల్
ఇందుకోసం ఖతర్నాక్ ప్లాన్ వేశారు. పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు, సెంటి బాటిళ్లు ఎంచుకున్నారు. అందులో బంగారం దాచి ఉంచారు. అయితే వారి ప్లాన్ వర్కవుట్ కాలేదు. ఆ ఇద్దరి మీద అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అంతే, వారి బండారం బట్టబయలైంది. అక్రమంగా బంగారం తరలింపు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు దర్యాఫ్తు చేస్తున్నారు. ఈ బంగారం ఎక్కడికి తరలిస్తున్నారు? దీని వెనుక ఎవరెవరు ఉన్నారు? అనేది ఆరా తీస్తున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు నిత్యం క్షుణ్ణంగా తనిఖీలు చేస్తుంటారు. తాజాగా గోల్డ్ స్మగ్లింగ్ గురించి పక్కా సమాచారం అందడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికులను చెక్ చేశారు. ఇద్దరి దగ్గర పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు, సెంట బాటిళ్లు గుర్తించారు. వాటిని ఓపెన్ చేసి చూడగా బంగారం బయటపడింది.
Also Read..Ice Cream : బాబోయ్.. ఐస్‌క్రీమ్ తిని బాలుడు మృతి.. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు
కాగా, గోల్డ్ స్మగ్లింగ్ కు శంషాబాద్ ఎయిర్ పోర్టు అడ్డాగా మారింది. విదేశాల నుంచి అక్రమ మార్గంలో అనేక పద్దతుల్లో బంగారాన్ని తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధికారులు ఎంత నిఘా పెట్టినా.. గోల్డ్ స్మగ్లింగ్ ప్రయత్నాలకు అడ్డుకట్టపడటం లేదు. అక్రమార్కులు రెచ్చిపోతూనే ఉన్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. అయితే, అధికారుల ముందు వారి ఆటలు సాగడం లేదు. అడ్డంగా దొరికిపోతున్నారు. కాగా, గతంలో వేర్వేరు పద్దతుల్లో అక్రమ బంగారాన్ని తరలిస్తున్న అనేక ముఠాలను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.