షర్మిల కేసు: 8 వెబ్ సైట్లకు నోటీసులు జారీ 

వైసీపీ అధినేత జగన్ చెల్లెలు వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో అభ్యంతర కరమైన పోస్టులు, వీడియోలు షేర్ చేస్తూ ఆమె మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించిన 8 వెబ్ సైట్లకు పోలీసులు శనివారం నోటీసులు జారీ చేశారు.

  • Published By: chvmurthy ,Published On : January 20, 2019 / 03:15 AM IST
షర్మిల కేసు: 8 వెబ్ సైట్లకు నోటీసులు జారీ 

వైసీపీ అధినేత జగన్ చెల్లెలు వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో అభ్యంతర కరమైన పోస్టులు, వీడియోలు షేర్ చేస్తూ ఆమె మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించిన 8 వెబ్ సైట్లకు పోలీసులు శనివారం నోటీసులు జారీ చేశారు.

హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్ చెల్లెలు వైఎస్ షర్మిలపై సోషల్ మీడియాలో అభ్యంతర కరమైన పోస్టులు, వీడియోలు షేర్ చేస్తూ ఆమె మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించిన 8 వెబ్ సైట్లకు పోలీసులు శనివారం నోటీసులు జారీ చేశారు. సినీ హీరో ప్రభాస్ తో ఆమెకు సంబంధాన్నిఅంటగడుతూ గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు, వీడియోలు షేర్ అవుతున్నాయి. వీటిపై షర్మిల హైదరాబాద్లోని  సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
షర్మిల ఫిర్యాదుపై విచారణ చేపట్టిన సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తులో భాగంగా కొన్ని వెబ్ సైట్లను, ఫేస్ బుక్ ఎకౌంట్లను గుర్తించారు. వాటిలో వీడియోలు, వార్తలు, అప్ లోడ్ చేసిన వారిని విచారించి అందులో 5 గురికి అరెస్టు నోటీసులు జారీ చేశారు.  మిగిలిన  సైట్ల ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 8 వెబ్‌సైట్లకు నోటీసులు జారీ చేశారు. ఐపీ అడ్రస్ ల ఆధారంగా వాటి యాజమానుల వివరాలను పదిరోజుల్లోగా ఇవ్వాలని యూట్యూబ్ చానెళ్లకు ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియాలో  వీడియో లింక్‌లకు, పోస్టులకు కామెంట్లు పెట్టిన వారి వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. వారిపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది.