లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన SI

  • Published By: chvmurthy ,Published On : December 18, 2019 / 12:06 PM IST
లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన SI

Updated On : December 18, 2019 / 12:06 PM IST

లక్ష రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికి పోయాడు శ్రీ సిటీ ఎస్సై సుబ్బారెడ్డి. చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం  శ్రీసిటీ ఎస్ఐ సుబ్బారెడ్డి ఏసీబీ వలలో చిక్కుకున్నారు. బుధవారం శ్రీ సిటీ ఎస్సై సుబ్బారెడ్డి లంచం లక్ష రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అవినీతి నిరోధక శాఖ సీఐ విజయ్ శేఖర్ ఆధ్వర్యంలోనే ఏసీబీ బృందం వలపన్ని సుబ్బారెడ్డిని పట్టుకున్నారు. 

ముఖ్యంగా పలు కేసుల్లోనూ, ఇసుక మాఫియా లోను తెరచాటున వ్యవహారాలు జరుపుతూ లంచం తీసుకుంటున్నట్లు సుబ్బారెడ్డి పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ బుధవారం దాడులు జరిపి ఎస్ఐ సుబ్బారెడ్డిని పట్టుకోగలిగారు. ప్రస్తుతం ఎస్ఐ సుబ్బారెడ్డిని నెల్లూరు జిల్లా సుళ్ళూరుపేటలో విచారిస్తున్నారు.