Ragging In Jangaon District : ర్యాగింగ్ భూతానికి విద్యార్ధి బలి

జనగాం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ల  ర్యాగింగ్ లో భాగంగా  గుట్కా ప్యాకెట్లు తెస్తున్న విద్యార్ధిని ప్రిన్సిపాల్ చూసారు.

Ragging In Jangaon District : ర్యాగింగ్ భూతానికి విద్యార్ధి బలి

Student Suicide

Updated On : December 21, 2021 / 9:29 PM IST

Ragging In Jangaon District :  జనగాం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ల  ర్యాగింగ్ లో భాగంగా  గుట్కా ప్యాకెట్లు తెస్తున్న విద్యార్ధిని ప్రిన్సిపాల్ చూసారు. తల్లితండ్రులకు ఆవిషయం చెప్పారు. భయంతో విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు.  స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని  కరుణాపురంలోని మహాత్మ జ్యోతిరావు పూలే ప్రభుత్వ హాస్టల్ లో…. పరకాల శాయంపేట‌కి చెందిన భరత్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

ఇదే హాస్టల్ లో  ద్వితీయ సంవత్సరం చదువుతున్న సీనియర్స్ గుట్కా పాకెట్స్ తీసుకుని రమ్మని సోమవారం భరత్‌ని ర్యాగింగ్ చేశారు.   భరత్ గుట్కా ప్యాకెట్లు  తీసుకు వస్తుండగా చూసిన ప్రిన్సిపాల్ ఈ విషయం భరత్ తల్లి తండ్రులకి తెలియజేశారు.
Also Read : Omicron Threat : ఒమిక్రాన్‌పై జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్రం
తల్లి తండ్రులు ఏమన్నా అంటారేమో అనే  భయంతో ఏం చేయలో తెలియక, పరకాల శాయంపేటలోని తమ పొలం దగ్గర పురుగుల మందు తాగి ఇంటికి  వచ్చాడు. ఇంటికి రావడం తోటే అతని వాలకం గమనించిన తల్లిదండ్రులు వెంటనే స్పందించి పరకాలలోని   హాస్పిటల్ లో  చేర్చగా అప్పటికే సీరియస్‌గా ఉందని డాక్టర్లు తెలిపారు.  వెంటనే వారు వరంగల్ ఎంజీఎంలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.