Suryapet : నిందితుడిని కొట్టాడని ఎస్ఐ ట్రాన్స్‌ఫర్
దొంగతనం కేసులో ఓ వ్యక్తిని స్టేషన్‌కి పిలిపించి అతడిని దారుణంగా కొట్టారని ఆరోపణలు రావడంతో సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) పోలీస్ స్టేషన్ ఎస్ఐ లింగంని బదిలీ చేశాడు.

Suryapet
Suryapet : దొంగతనం కేసులో ఓ వ్యక్తిని స్టేషన్‌కి పిలిపించి అతడిని దారుణంగా కొట్టారని ఆరోపణలు రావడంతో సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (ఎస్) పోలీస్ స్టేషన్ ఎస్ఐ లింగంని బదిలీచేశాడు ఎస్పీ రాజేంద్ర ప్రసాద్.. వివరాల్లోకి వెళితే.. గత నెలలో ఆత్మకూరు మండలం ఏపూర్‌లోని ఓ బెల్ట్ షాపులో చోరీ జరిగింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మండలంలోని రామోజీతండాకు చెందిన నవీన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకోని విచారించాడు.
చదవండి : Woman Police Inspector: చెన్నై వరదల్లో మహిళా ఎస్సై.. స్పృహ కోల్పోయిన వ్యక్తిని భుజాలపై మోసుకెళ్తూ..
విచారణలో తానే ఈ చోరీ చేసినట్లు అంగీకరించాడు నవీన్.. తనతోపాటు అదే తండాకు చెందిన వీరశేఖర్ కూడా ఉన్నట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో వీరశేఖర్‌ను స్టేషన్‌కు పిలిపించారు పోలీసులు.. స్టేషన్‌కి వచ్చిన కొద్దీ గంటలకే వీరశేఖర్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో పోలీసులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వీరశేఖర్ సృహతప్పి పడిపోయాడని ఇంటికి తీసుకెళ్లాలని సూచించారు.
చదవండి : Police lathi-charge: అనంతపురంలో విద్యార్థులపై విరిగిన లాఠీ.. విద్యార్థినికి పగిలిన తల
పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న కుటుంబ సభ్యులు వీరశేఖర్‌ను ఇంటికి తీసుకెళ్లారు.. ఇదే సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో 200 మంది తండావాసులతో వచ్చి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. ఎస్ఐ తనను చితకబాదాడని, కాళ్ల మీద పడ్డా కనికరం చూపలేదని బాధితుడు ఆరోపించారు. ఎస్ఐని వెంటనే విధుల నుంచి తొలగించాలని బాధితుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. వ్యవహారం ఎస్పీ వద్దకు చేరడంతో ఎస్ఐ లింగంను వీఆర్(వెకన్సీ రిజర్వ్)కు పంపారు.