సూత్రధార యాక్టింగ్ స్కూల్ యజమాని వినయ్ వర్మ అరెస్టు

సూత్రధార యాక్టింగ్ స్కూల్ యజమాని వినయ్ వర్మను పోలీసులు అరెస్టు చేశారు. నటన నేర్చుకోవాలంటే బట్టలు విప్పాలంటూ 9 మంది యువతులతో అసభ్యంగా ప్రవర్తించారంటూ అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఓ యువతి ఫిర్యాదుతో వినయ్ వర్మపై నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 354A(నిర్భయ) యాక్ట్, 506, 509 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. వినయ్ వర్మను అరెస్టు చేసిన పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.
వినయ్ వర్మ దగ్గరకు యాక్టింగ్ నేర్చుకోవడానికి వచ్చిన 9 మంది యువతులతో బట్టలు విప్పించి యాక్టింగ్ నేర్పించిన సన్నివేశాన్ని ఓ యవతి బయటపెట్టింది. అక్కడ జరిగిన అరాచకాలన్నింటిపై మీడియాలో మాట్లాడిన సందర్భంగా షీ టీమ్ లో మొదటగా కేసు నమోదు అయింది. దీనిపై పోలీసులు విచారణ చేసిన తర్వాత అతన్ని అరెస్టు చేశారు. తన దగ్గరున్న కొన్ని ఆధారాలను కూడా యువతి పోలీసులకు ఇచ్చినట్లు తెలుస్తోంది.