హెలికాఫ్టర్ క్రాష్…తైవాన్ ఆర్మీ చీఫ్ మృతి

హెలికాఫ్ట్రర్ క్రాష్ ఘటనలో తైవాన్ ఆర్మీ చీప్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రతికూల వాతావరణంలో రాజధాని తైపీకి దగ్గర్లో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆర్మీ చీఫ్ జనరల్ షెన్ యి మింగ్‌తో మరో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
గురువారం బ్లాక్ హాక్ హెలికాప్టర్‌లో జనరల్ షెన్ యి మింగ్‌తో పాటు 12 మంది ఆర్మీ ఉన్నతాధికారులు బయలుదేరారు. ఇలన్ కౌంటీలో ఉన్న డాంగావో మిలటరీ బేస్‌ను వారు తనిఖీ చేయాల్సి ఉంది. వారు బయలుదేరిన అరగంట తర్వాత ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌తో సమాచారం కట్ అయింది. అయితే, వాతావరణ పరిస్థితుల కారణంగా వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కొండల్లో అత్యవసరంగా దిగాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రమాదం జరగ్గా జనరల్ షెన్ యి మింగ్ సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.
తొలుత ఆయన మిస్ అయినట్టు వార్తలు వచ్చాయి. కొందరు హెలికాప్టర్ శకలాల కింద ప్రాణాలతో ఉన్నారని ప్రచారం జరిగింది. అయితే, చివరకు ఆర్మీ చీఫ్ చనిపోయినట్టు ధ్రువీకరించారు. ఘటన జరిగిన ప్రాంతానికి రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లను పంపారు. సహాయక చర్యల నిమిత్తం 80 మంది సైనికులను అందులో పంపారు. కొండ ప్రాంతాలు కావడంతో సహాయకచర్యలు ఆటంకం కలుగుతోందని తైవాన్ మిలటరీ అధికారులు తెలిపారు.