ఎంత దారుణం : 11 నెమళ్లను చంపేసిన రైతు..ఎందుకో తెలిస్తే షాక్ తింటారు

  • Published By: madhu ,Published On : June 10, 2020 / 05:31 AM IST
ఎంత దారుణం : 11 నెమళ్లను చంపేసిన రైతు..ఎందుకో తెలిస్తే షాక్ తింటారు

Updated On : June 10, 2020 / 5:31 AM IST

భారతదేశంలో ఓ పక్కన కరోనా విజృంభిస్తుంటే..మనుషులు మాత్రం క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. మూగజీవాలను పొట్టన పెట్టుకుంటున్నారు. వాటితో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అమాయక జీవుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఏనుగులు, కుక్కలు..ఇతర జీవాలను ఏ మాత్రం వదలడం లేదు.

తాజాగా..తన స్వార్థం కోసం 11 నెమళ్లకు విషం పెట్టి చంపాడో ఓ రైతు. ఇలా ఎందుకు చేశావంటే..తన పొలాన్ని కాపాడుకోవడానికి చేశానంటూ చెప్పడంతో అందరూ షాక్ కు గురయ్యారు. దీనికి ఎన్నో మార్గాలున్నాయి..కదా..ఇలా నెమళ్లు చంపడం దారుణం కదా అని అంటున్నారు. ఈ విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువూర్ డిస్ట్రిక్ తారాపురంలో చోటు చేసుకుంది. 

పుత్తూరు ప్రాంతంలో రైతులు వ్యవసాయ పొలంలో కూరగాయాలు, పండ్లు, ఇతర పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కానీ..ఇక్కడ నెమళ్లు తరచూ పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయని రైతులు అటవీ శాఖాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే..ఒక్కటి కాదు..రెండు కాదు..11 నెమళ్లు విగతజీవులుగా పడి ఉండడం అక్కడి వారు గుర్తించారు.

ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వ్యవసాయ అధికారి తిరుమూర్తి, అటవీ శాఖ ఉద్యోగి మణివన్నన్ ఆ ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. రైతు ముత్తుస్వామి కుమారుడు నెమళ్లకు విషం పెట్టినట్లు తేలింది. తన పంటను నెమళ్లు నాశనం చేస్తుండడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు చెప్పాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.