Rowdy Sheeter Ganja sales : హైదరాబాద్‌లో గంజాయి అమ్ముతున్న రౌడీ‌షీటర్ అరెస్ట్

హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని  వెంగళరావు నగర్ లో గంజాయి  విక్రయిస్తున్న రౌడీ షీటర్  పఠాన్ అలీఖాన్(50) అలియాస్ అలీ భాయ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Rowdy Sheeter Ganja sales : హైదరాబాద్‌లో గంజాయి అమ్ముతున్న రౌడీ‌షీటర్ అరెస్ట్

Ganja Seized

Updated On : November 2, 2021 / 9:45 PM IST

Rowdy Sheeter Ganja sales :  హైదరాబాద్ ఎస్సార్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని  వెంగళరావు నగర్ లో గంజాయి  విక్రయిస్తున్న రౌడీ షీటర్  పఠాన్ అలీఖాన్(50) అలియాస్ అలీ భాయ్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

బొరబండ అంజయ్య నగర్ కు చెందిన అలీఖాన్ గంజాయి విక్రయిస్తున్నాడని పోలీసులకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. దీంతో పశ్చిమ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు గత కొంతకాలంగా అలీఖాన్ పై నిఘా పెట్టారు.  మంగళవారం ఏజీ కాలనీ సెంటర్ వద్ద అలీఖాన్ గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నారు.

Also Read : Ration Rice : ప్రకాశం జిల్లాలో రేషన్ బియ్యం పట్టివేత

అతని వద్ద జేబులో నుంచి 10 గ్రాముల చొప్పున  ఉన్న 20 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అతని ద్విచక్ర వాహనం డిక్కీలో నుంచి కిలో బరువున్న గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని ఎస్సార్ నగర్ పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.