పోలీసు కానిస్టేబుల్ మిస్సింగ్

పోలీసు కానిస్టేబుల్ మిస్సింగ్

Updated On : February 17, 2021 / 5:21 PM IST

Telangana cop Missing in Gundala Police station : యాదాద్రి భువనగిరిజిల్లా గుండాల పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న జలీల్ పటేల్ అనే కానిస్టేబుల్ రెండు రోజులుగా కనిపించటంలేదు. ఉన్నతాధికారులు ఇటీవలే అతడ్ని గుండాల నుంచి నల్గోండకు బదిలీ చేశారు. అక్కడికి వెళ్ళటం అతనికి ఇష్టంలేదని తెలుస్తోంది. జలీల్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుండాల పోలీసు స్టేషన్ లో పని చేస్తున్న కానిస్టేబుల్ జలీల్ పటేల్ ను ఇటీవల నల్గోండకు బదిలీ చేశారు.  ఈనెల15న తన సోదరుడికి జలీల్ ఫోన్ చేసి తనను అన్యాయంగా బదిలీ చేశారని, నల్గోండకు వెళ్లటం తనకు ఇష్టం లేదని చెప్పాడు. అనంతరం అతని ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. అప్పటి నుంచి అతని జాడ తెలియంట లేదని అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.