Covid-19 : కోవిడ్ మృతురాలి మెడలో పుస్తెలతాడు మాయం
కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స పొందతూ మృతి చెందిన పేషెంట్ మెడలో ఉండాల్సిన పుస్తెలతాడు మాయం అవటంపట్ల బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు

Jewellary Missing Covid Patient
Covid-19 : కరోనా వైరస్ సోకి ఆస్పత్రిలో చికిత్స పొందతూ మృతి చెందిన పేషెంట్ మెడలో ఉండాల్సిన పుస్తెలతాడు మాయం అవటంపట్ల బాధితులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. జగిత్యాల మండలం పొలాస గ్రామానికి చెందిన సద్దినేని సాయమ్మకు నాలుగు రోజులు క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
కుటుంబ సభ్యులు ఆమెను కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 3గంటల సమయంలో ఆమె కన్నుమూసింది. ఆస్పత్రి వర్గాలు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న సమయంలో బంగారు కమ్మలు మాత్రమే అప్పగించారు.
ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడు లేకపోవటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రివారిని నిలదీయగా తమ వద్దకు రోగి వచ్చినప్పుడు పుస్తెలతాడు లేదని బుకాయించారు. రెండున్నర తులాల బంగారు పుస్తెల తాడు మాయం కావటంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.