Sri Chaitanya Techno School : ఖమ్మం శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో కలకలం, 3వ అంతస్తు నుంచి పడిపోయిన విద్యార్థిని, అసలేం జరిగింది?

ఖమ్మం శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో ప్రమాదం జరిగింది. స్కూల్ భవనం 3వ అంతస్తు పైనుంచి టెన్త్ విద్యార్థిని సాయి శరణ్య కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ఆ విద్యార్థినికి తీవ్రంగా గాయాలయ్యాయి.

Sri Chaitanya Techno School : ఖమ్మం శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో కలకలం, 3వ అంతస్తు నుంచి పడిపోయిన విద్యార్థిని, అసలేం జరిగింది?

Updated On : March 4, 2023 / 1:03 AM IST

Sri Chaitanya Techno School : ఖమ్మం శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో ప్రమాదం జరిగింది. స్కూల్ భవనం 3వ అంతస్తు పైనుంచి టెన్త్ విద్యార్థిని సాయి శరణ్య కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ఆ విద్యార్థినికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే స్కూల్ సిబ్బంది విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు విద్యార్థిని పైనుంచి పడిందని యాజమాన్యం చెబుతోంది. ఈ విషయం తెలిసిన వెంటనే విద్యార్థి సంఘాలు స్కూల్ ముందు ఆందోళనకు దిగాయి. స్కూల్ పై దాడి చేసి ఫర్నీచర్, పూల కుండీలు ధ్వంసం చేశారు. స్కూల్ ముందు పీడీఎస్ యూ ధర్నా చేశారు.

Also Read..Medico Preeti Case : మెడికో ప్రీతి కేసు.. సైఫ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు

పై నుంచి కింద పడిన ఘటనలో విద్యార్థిని సాయి శరణ్యకు ప్రాణాపాయం తప్పింది. స్కూల్ పక్కనే భవన నిర్మాణం జరుగుతోంది. అక్కడ పిల్లర్లు వేసి ఉన్నాయి. రాడ్లు ఉన్నాయి. నేురుగా ఆ పిల్లర్ల మీద కానీ పడుంటే, సాయి శరణ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయి ఉండేది. ప్రస్తుతం విద్యార్థిని కాళ్లు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యాయి. చదువులు, పరీక్షల ఒత్తిడితోనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే, దీనిపై కుటుంబసభ్యుల నుంచి ఎలాంటి స్పందనా లేదు.

Also Read..Ramanthapur : అదృశ్యమైన విద్యార్థి అనూష మృతి.. రామంతాపూర్ చెరువులో మృతదేహం లభ్యం

మరోవైపు విద్యార్థి సంఘాలు స్కూల్ ముందు ధర్నాకు దిగాయి. పాఠశాల యాజమాన్యంపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదంటున్నాయి విద్యార్థి సంఘాలు. మూడో అంతస్తు చుట్టూ ప్రహరీ ఉందని, మరి అక్కడ నుంచి జారి ఎలా పడుతుందని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. పాఠశాల యాజమాన్యంపై ఈ ఘటనపై నోరు మెదపకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పదే పదే శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఇలాంటి ఘటనలు ఎందుకు చోటు చేసుకుంటున్నాయి అని విద్యార్థి సంఘాల ప్రశ్నిస్తున్నాయి.(Sri Chaitanya Techno School)

Also Read..Satvik Case : సాత్విక్ సూసైడ్ లెటర్ లో పలు కీలక అంశాలు.. వీరి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఆవేదన

ఇటీవలే నార్సింగ్ లోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కలకలం రేపింది. చదువుల ఒత్తిడి తట్టుకోలేక సాత్విక్ సూసైడ్ చేసుకున్నాడు. చదువుల పేరుతో లెక్చరర్లు టార్చర్ పెడుతున్నారు, నరకం చూపిస్తున్నారు అంటూ సాత్విక్.. సూసైడ్ నోట్ లో వాపోయాడు. తల్లిదండ్రులకు తన బాధ చెప్పుకోలేక, టీచర్లను ఎదురించలేక ప్రాణాలు తీసుకున్నాడు.

Also Read..Heart Attack : బాబోయ్.. గుండెపోటుతో మరో విద్యార్థి మరణం, మేడ్చల్ CMR కాలేజీలో విషాదం