ఏం తెలివి : సీసీ కెమెరా డైరెక్షన్ మార్చి భారీ చోరీ

దొంగలు రెచ్చిపోతున్నారు. తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఎంత భద్రత ఉన్నా, నిఘా ఉన్నా.. పక్కా పథకం ప్రకారం చోరీలకు పాల్పడుతున్నారు.

  • Published By: veegamteam ,Published On : February 16, 2020 / 09:18 AM IST
ఏం తెలివి : సీసీ కెమెరా డైరెక్షన్ మార్చి భారీ చోరీ

Updated On : February 16, 2020 / 9:18 AM IST

దొంగలు రెచ్చిపోతున్నారు. తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఎంత భద్రత ఉన్నా, నిఘా ఉన్నా.. పక్కా పథకం ప్రకారం చోరీలకు పాల్పడుతున్నారు.

దొంగలు రెచ్చిపోతున్నారు. తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఎంత భద్రత ఉన్నా, నిఘా ఉన్నా.. పక్కా పథకం ప్రకారం చోరీలకు పాల్పడుతున్నారు. దొంగతనాలు, నేరాలు నియంత్రించడానికి సెక్యూరిటీలో భాగంగా ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు బిగించుకుంటున్నారు. చాలావరకు సీసీ కెమెరాలు వర్కవుట్ అవుతున్నాయి. సీసీ కెమెరాలు ఉండటంతో దొంగతనం చేసేందుకు వీలు కావడం లేదు. అయితే ఓ దొంగ మాత్రం తెలివి చూపించాడు. సీసీ కెమెరా డైరెక్షన్ మార్చి దొంగతనం చేశాడు.

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో నివాసం ఉండే ఓ వ్యాపారి ఇంట్లో శుక్రవారం(ఫిబ్రవరి 14,2020) రాత్రి భారీ చోరీ జరిగింది. దాదాపు రూ.10 లక్షల విలువైన ఆభరణాలు దొంగిలించారు. రోడ్ నెంబర్ 34లో నివసించే నజీ అలీఖాన్ ఇంటి వెనుక నుంచి ప్రవేశించిన ఆగంతుకుడు సీసీ కెమెరా దిశను మార్చాడు. రెండో అంతస్తులో చేతి సంచిలో పెట్టిన బంగారు వజ్రాభరణాలను తస్కరించాడు. ఎంచక్కా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. దొంగ తెలివి తేటలకు ఇంటి యాజమానితో పాటు పోలీసులు షాక్ అయ్యారు.

కాగా, గతంలో ఇంట్లో పనిచేసిన వారిపై నజీ అలీఖాన్ అనుమానం వ్యక్తం చేశారు. ఆ దిశగా పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరా డైరెక్షన్ మార్చడంతో.. అందులో దొంగ దృశ్యాలు రికార్డ్ కాలేదు. దీంతో దొంగ ఎవరో తెలుసుకోవడం కష్టంగా మారింది.