Thieves Attack : నవ దంపతులపై దాడి..మంగళ సూత్రం, గొలుసు ఎత్తుకెళ్ళిన దుండగులు

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొత్త దంపతులను వెంటాడిన దుండగులు వారిని గాయపరిచి మహిళ మెడలోని మంగళసూత్రం, యువకుడి మెడలోని బంగారు గొలుసు తెంపుకుని పారిపోయారు.

Thieves Attack : నవ దంపతులపై దాడి..మంగళ సూత్రం, గొలుసు ఎత్తుకెళ్ళిన దుండగులు

Thugs Attack

Updated On : September 21, 2021 / 11:39 AM IST

Thieves Attack :  కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కొత్త దంపతులను వెంటాడిన దుండగులు వారిని గాయపరిచి మహిళ మెడలోని మంగళసూత్రం, యువకుడి మెడలోని బంగారు గొలుసు తెంపుకుని పారిపోయారు.

కాగజ్ నగర్ మండలం కడంబ అభయారణ్యం ఏరియాలో బైక్‌పై   వెళుతున్న యువజంటపై దుండగులు దాడి చేశారు. అంజన్న, మౌనిక అనే యువ దంపతులు అభయారణ్యంలో ద్విచక్ర  వాహనంపై వెళుతున్నారు. వారిని వెంబడించిన దుండగులు దట్టమైన అటవీ ప్రాంతం  రాగానే ఇనుపరాడ్లతో వారిపై దాడి చేశారు.
Also Read : Tollywood Drugs Case : ముగిసిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ ?

దంపతులిద్దరూ బైక్ పై నుంచి కింద పడగానే మౌనిక మెడలోని మంగళసూత్రాన్ని, అంజన్న మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లిపోయారు. దీంతో దంపతులిద్దరూ ప్రాణ భయంతో అడవిలోకి పారిపోయారు.

కాగా… ఈ ఘటనకు సంబంధించి అదే దారిలో వెళుతున్న ట్రాక్టర్ డ్రైవర్ వారిని గుర్తించి స్ధానికుల సహాయంతో పోలీసులకు సమచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనాస్ధలానికి చేరుకున్న పోలీసులు గాయాలపాలైన మౌనిక, అంజన్నలను కాగజ్ నగర్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.