Fire Accident : హైదరాబాద్ లో అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు.

Fire Accident
Fire Accident : హైదరాబాద్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. నగరంలోని కుషాయిగూడలోని ఓ టింబర్ డిపోలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు డిపో మొత్తానికి అంటున్నాయి. భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. పక్కనే ఉన్న భవనానికి మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లో ఉన్న దంపతులు సహా బాలుడు సజీవ దహనం అయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. మంటల్లో చిక్కుకుని సజీవ దహనమైన మూడు మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది బయటికి తీశారు.
కనిపించకుండా పోయిన మరో చిన్నారి కోసం గాలిస్తున్నారు. మృతులు నల్గొండ జిల్లా తుంగతుర్తికి చెందిన నరేశ్(35), సుమ(28), జోషిత్(8)గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.