మసీదు దగ్గర భారీ పేలుడు : ముగ్గురు మృతి
ఇరాక్ లో డాయిష్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షియాలే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. మసీద్ దగ్గర బైక్ బాంబు పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. 34 మంది

ఇరాక్ లో డాయిష్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షియాలే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. మసీద్ దగ్గర బైక్ బాంబు పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. 34 మంది
ఇరాక్ లో డాయిష్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షియాలే లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. మసీద్ దగ్గర బైక్ బాంబు పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. 34 మంది గాయపడ్డారు. ముసయ్యిబ్ గ్రామంలోని షియా మసీదు దగ్గర ఈ పేలుడికి పాల్పడ్డారు. పార్క్ చేసి ఉన్న బైక్ పేలినట్టు స్థానికులు వెల్లడించారు. ఈ దాడికి పాల్పడింది తామే అని డాయిష్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.
ముసయ్యిబ్ వాణిజ్య ప్రాంతం. జనాలు ఎక్కువగా ఉంటారు. దీంతో టెర్రరిస్టులు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. డాయిష్ ఉగ్రవాదులపై విజయం సాధించినట్టు ఇరాక్ ఆర్మీ 2017లో ప్రకటించింది. ఉగ్రవాద సంస్థని నాశనం చేశామని చెప్పింది. కానీ ఉగ్రదాడులు మాత్రం ఆగడం లేదు. ఉనికిని చాటుకునేందుకు ముష్కర మూకలు దాడులకు తెగబడుతూనే ఉన్నాయి. అమాయకులను చంపుతూ రక్తపుటేరులు పారిస్తున్నారు.
తాజా ఘటనతో ఇరాక్ ఆర్మీ అలర్ట్ అయ్యింది. డాయిష్ ఉగ్రవాద సంస్థ అంతు చూసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. స్లీపర్ సెల్స్ పని పట్టేందుకు కొత్త ఆపరేషన్ అనౌన్స్ చేసింది. సెర్చ్ అండ్ క్లియర్ పేరుతో ఆపరేషన్ చేపడతామన్నారు. సౌదీ అరేబియా, జోర్డాన్, సిరియా బోర్డర్ లో ఆపరేషన్ బిగిన్ చేస్తామన్నారు.
Also Read : మనుషులేనా : విరిగిన కాళ్లనే తలగడగా పెట్టారు