Tiger Tension : పెద్ద పులి దాడిలో మహిళ మృతి.. తెలంగాణ-మహారాష్ట్ర బోర్డర్ లో మరోసారి టైగర్ టెన్షన్..

ఈ పులి మళ్లీ తెలంగాణవైపు వచ్చే అవకాశం ఉందన్న అంచనా వేస్తున్నారు.

Tiger Tension : పెద్ద పులి దాడిలో మహిళ మృతి.. తెలంగాణ-మహారాష్ట్ర బోర్డర్ లో మరోసారి టైగర్ టెన్షన్..

Tiger Tension (Photo Credit : Google)

Updated On : December 24, 2024 / 6:37 PM IST

Tiger Tension : తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో మరోసారి పెద్ద పులి పంజా విసిరింది. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా కవీట్ పేట్ దగ్గర మహిళపై దాడి చేసింది పెద్ద పులి. ఈ దాడిలో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలిని లాలుబాయిగా గుర్తించారు. ఇటీవల కాగజ్ నగర్ ప్రాంతంలో ఇద్దరు వ్యక్తులతో పాటు పశువులపై దాడి చేసిన పెద్ద పులే ఈ దాడి చేసినట్లుగా అనుమానిస్తున్నారు అధికారులు. పెద్ద పులి సంచారం, దాడితో రాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

Tiger attack

పులి దాడిలో స్పాట్ లోనే మహిళ మృతి..
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా కవీట్ పేట్.. తెలంగాణ రాష్ట్రానికి చాలా సమీపంలో ఉంటుందీ గ్రామం. అక్కడ మహిళపై పెద్ద పులి దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ మహిళ.. స్పాట్ లోనే ప్రాణాలు వదిలింది. ఇటీవల కాగజ్ నగర్ లోనూ పెద్ద పులి మనుషులపై దాడి చేసింది. వరుసగా పశువులపై దాడి చేసింది. ఆ పులే ఇప్పుడు మహిళపై దాడి చేసినట్లు అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.

Also Read : విశాఖలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు.. ఫ్యాన్‌ పార్టీకి హ్యాండ్‌ ఇస్తున్న కీలక నేతలు..

పశువులపై దాడి చేసిన పెద్ద పులి..
పెద్ద పులి మహారాష్ట్ర వైపు నుంచి మాకుడి రైల్వే స్టేషన్ సమీపం నుంచి తెలంగాణలోకి ప్రవేశించింది. కుడికిలి నుంచి చీలపల్లి, వేంపల్లి అటవీ ప్రాంతంలో ఈ పులి రెండు రోజుల పాటు సంచరించింది. అక్కడ పశువులపై దాడి చేసింది. దీన్ని ఫారెస్ట్ శాఖ అధికారులు కూడా నిర్ధారించారు. వేంపల్లి, చీలపల్లి అటవీ ప్రాంతం నుంచి మళ్లీ ఈ పులి మహారాష్ట్ర వైపు వెళ్లినట్లుగా తెలుస్తోంది. అక్కడ వృద్ధురాలిపై దాడి చేసి హతమార్చింది. అదే పులిగా అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.

Tiger Tension

పులి దాడితో తీవ్ర భయాందోళనలో గ్రామస్తులు..
ఈ పులి మళ్లీ తెలంగాణవైపు వచ్చే అవకాశం ఉందన్న అంచనా వేస్తున్నారు. మాకుడి లేదా అల్లూరి రైల్వే స్టేషన్ ప్రాంతం నుంచి మళ్లీ కుడికిలి మీదు పులి తెలంగాణ వైపు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వరుసగా మనుషులపై దాడి చేయడంతో పులి విషయంలో సరిహద్దు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

అటు మహారాష్ట్ర గ్రామాల చెందిన ప్రజలు సైతం భయంతో వణికిపోతున్నారు. ఇళ్ల నుంచి ఒంటరిగా బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. ఎప్పుడు ఎటువైపు నుంచి పులి దాడి చేస్తుందోనని ప్రాణ భయంతో బతుకుతున్నారు.

 

Also Read : అసలు నర్సాపూర్‌లో ఏం జరుగుతోంది? ముగ్గురు నేతలు ఎవరికివారే యమునా తీరే!