Madhya Pradesh: ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి.. ఓనర్‌పై చెప్పుతో దాడి చేసిన మృతుడి బంధువులు

ట్రాక్టర్ అదుపుతప్పి, తలకిందులైంది. ఈ ఘటనలో డ్రైవర్ మరణించాడు. అయితే, ట్రాక్టర్ యజమానిపై మృతుడి బంధువులు దాడి చేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్, సింగ్రౌలి జిల్లా, రాంపూర్ గ్రామంలో జరిగింది.

Madhya Pradesh: ట్రాక్టర్ తిరగబడి డ్రైవర్ మృతి.. ఓనర్‌పై చెప్పుతో దాడి చేసిన మృతుడి బంధువులు

Updated On : December 27, 2022 / 12:33 PM IST

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. ట్రాక్టర్ అదుపుతప్పి, తలకిందులైంది. ఈ ఘటనలో డ్రైవర్ మరణించాడు. దీనికి బాధ్యుడిని చేస్తూ ట్రాక్టర్ ఓనర్‌పై దాడికి పాల్పడ్డారు మృతుడి బంధువులు. ఈ ఘటన మధ్యప్రదేశ్, సింగ్రౌలి జిల్లా, రాంపూర్ గ్రామంలో జరిగింది.

China Covid: కోవిడ్ కేసులు పెరుగుతున్నా టూరిస్టులకు క్వారంటైన్ రూల్స్ ఎత్తివేసిన చైనా

అమిత్ వైష్ అనే వ్యక్తికి చెందిన ట్రాక్టర్‌ను మర్దన్ సింగ్ అనే డ్రైవర్ నడిపేవాడు. అయితే, సోమవారం మర్దన్ సింగ్ ట్రాక్టర్ నడుపుతుండగా, అది అదుపుతప్పి తిరగబడింది. ఈ ఘటనలో మర్దన్ సింగ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే విషయం తెలుసుకున్న అమిత్.. అతడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాడు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ మర్దన్ మరణించాడు. దీంతో మర్దన్ బంధువులు అమిత్‌పై కోపం తెచ్చుకున్నారు. మర్దన్ మృతదేహాన్ని చూసేందుకు అమిత్ రాగా, బంధువులు అతడ్ని కట్టేసి కొట్టారు. చెప్పులతో దాడి చేశారు. అయితే, ఎలాగోలా అమిత్ అక్కడ్నుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు.

China Covid: కోవిడ్ కేసులు పెరుగుతున్నా టూరిస్టులకు క్వారంటైన్ రూల్స్ ఎత్తివేసిన చైనా

అక్కడ తనపై దాడి చేసిన మృతుడి బంధువులపై ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆస్పత్రి సిబ్బందిని విచారిస్తున్నారు. కాగా, అమిత్‌పై దాడి చేస్తున్న సమయంలో కొందరు ఈ దృశ్యాల్ని వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో అక్కడి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, చాలా మంది వీడియోలు తీశారు కానీ, ఒక్కరు కూడా దాడిని ఆపేందుకు ముందుకు రాలేదు.