Ujjain Tragedy: పండగ పూట పెను విషాదం.. దుర్గామాత నిజ్జనంలో ప్రమాదం.. 8మంది దుర్మరణం..
మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. ఆ తర్వాత మృతుల సంఖ్య పెరిగింది.

Ujjain Tragedy: మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో విజయదశమి రోజు విషాదం చోటు చేసుకుంది. అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్లిన సందర్భంలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 8మంది మృతి చెందారు. అమ్మవారి విగ్రహాన్ని చంబల్ నదిలో నిమజ్జనానికి తీసుకెళ్లిన సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో ప్రమాద స్థలిలోనే ఇద్దరు చనిపోయారు. ఒకరు గల్లంతయ్యారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. ఆ తర్వాత మృతుల సంఖ్య పెరిగింది.
”ప్రమాదం జరిగినప్పుడు ట్రాక్టర్ లో దాదాపు 12 మంది ఉన్నారు. కొంతమంది యువకులు, పిల్లలు మాతా జీ నిమజ్జనం కోసం వచ్చారు. అకస్మాత్తుగా, ట్రాలీ, ట్రాక్టర్ రెండూ నదిలో పడిపోయాయి. దురదృష్టవశాత్తు కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఉజ్జయినికి 35 కిలోమీటర్ల దూరంలో నరసింగ గ్రామం వద్ద ఈ దుర్ఘటన జరిగింది. 12 మంది భక్తులతో వచ్చిన ట్రాక్టర్ ట్రాలీ.. బ్రిడ్జిని క్రాస్ చేసే సమయంలో బోల్తా కొట్టింది” అని ఉజ్జయిని ఏఎస్పీ తెలిపారు.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, అధికారులు స్పాట్ కి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు సైతం అక్కడికి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ ప్రమాదంలో బాధితులు త్వరగా కోలుకోవాలని ఏఎస్పీ ఆకాంక్షించారు. గాయపడ్డ బాధితులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునే పనిలో ఉన్నారు.
Also Read: దగ్గు మందు తాగి ఇద్దరు పిల్లలు మృతి.. అదేం లేదు.. నేను తాగుతా అని తాగిన డాక్టర్.. కట్ చేస్తే..