Kurnool Murder : కర్నూలు జిల్లాలో భగ్గుమన్న ఫ్యాక్షన్..ఇద్దరి దారుణ హత్య
కర్నూలు జిల్లాలో ఫాక్ష్యన్ రాజకీయాలు భగ్గుమన్నాయి. ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు.

Kurnool Faction Murder
Kurnool Murder : కర్నూలు జిల్లాలో ఫాక్ష్యన్ రాజకీయాలు భగ్గుమన్నాయి. జంట హత్యలతో గురువారం ఉదయం జిల్లా ఉలిక్కిపడింది. పాణ్యం మండలం గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో అన్నదమ్మలు దారుణ హత్యకు గురయ్యారు.
గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు వొడ్డు ప్రతాపరెడ్డి, వొడ్డు నాగేశ్వర్రెడ్డిలు ఇటీవల కన్నుమూసిన తమ తమ్ముడు దినకర్మల నిర్వహణకు గురువారం ఉదయం 7 గంటలకు స్మశానం వద్దకు వెళుతుండగా, వాహనంలో వచ్చిన దుండగులు రెప్పపాటు క్షణంలో అన్నదమ్ములపై దాడిచేసి హత్య చేశారు.
వీరి వెంట ఉన్న ముగ్గురు బంధువులకు గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని అంబులెన్స్‌లో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు శాంతి భద్రతలు పరిరక్షిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.