Road Accident : ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి

జాబితా‌పూర్ గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న వాహనం వలన రోడ్డు కనిపించకపోవడంతో అదుపు తప్పిన ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతులు మహారాష్ట్రకు చెందినవారు

Road Accident : ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు మృతి

Traacrtor Accident

Updated On : December 17, 2021 / 3:14 PM IST

Road Accident :  జగిత్యాల జిల్లా గొల్లపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుఝూమున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  మండలంలోని జాబితా‌పూర్ గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న వాహనం వలన రోడ్డు కనిపించకపోవడంతో అదుపు తప్పిన ఇసుక ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు మరణించారు. మృతులు మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ మరియు సంతోష్ గా గుర్తించారు.
Also Read : Omicron Variant : ఒమిక్రాన్, డెల్టా కంటే వేగంగా వ్యాప్తి చెందుతోంది-కేంద్ర మంత్రి
ట్రాక్టర్ తిరగబడటంతో వారిద్దరు దానికింద ఇరుక్కుని అక్కడికక్కడే మృతి చెందారు. సుమారు గంట పాటు కష్టపడి పోలీసులు క్రేన్ సహాయంతో మృతదేహాలను బయటకు తీసి జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు వ్యక్తులకు స్వల్పంగా గాయాలయ్యాయి. వారిని కూడా చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.