‘పబ్‌జీ’ ఆడుతూ చనిపోయిన యువకులు 

  • Published By: vamsi ,Published On : March 18, 2019 / 03:04 AM IST
‘పబ్‌జీ’ ఆడుతూ చనిపోయిన యువకులు 

టెన్‌సెంట్ కంపెనీకి చెందిన ప్రముఖ ఆన్‌లైన్ మల్టీ ప్లేయర్ గేమ్ ‘పబ్‌జీ’ కారణంగా రోజురోజుకీ యువత ప్రపంచాన్ని మరిచిపోతుంది. ఈ పబ్‌జీ గేమ్ వల్ల ఎందరో యువకులు ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి. ఇదే క్రమంలో తాజాగా మహారాష్ట్రలోని హింగోలి ప్రాంతంలో నాగేశ్‌ గోరే(22), స్వప్నిల్ అన్నపూర్నే (24) అనే ఇద్దరు ప్రాణాలను కోల్పోయారు. ఇద్దరు యువకులు ఆటలో మునిగిపోయి ఉండగా వారిని రైలు ఢీకొట్టింది.
Read Also : స్వైన్ ఫ్లూ అలర్ట్ : రాజకీయ ర్యాలీల్లో జాగ్రత్తగా ఉండండి

శనివారం సాయంత్రం సమయంలో ఖటకాళీ బైపాస్‌ వద్ద ఉన్న రైల్వే ట్రాక్‌ దగ్గరకు వీరిద్దరూ బైక్‌పై వచ్చారు. ట్రాక్‌ పక్కన బైక్‌ను ఉంచి పట్టాలపై కూర్చుని ‘పబ్‌జీ’ ఆడతుండగా వారిని రైలు గుద్దడంతో చనిపోయారు. ఆటలో నిమగ్నమైన ఇద్దరు యువకులు అజ్మీర్‌–హైదరాబాద్‌ రైలు వస్తుండగా గమనించలేదు. రైలు డ్రైవర్‌ హార్న్‌ కొట్టినా వినిపించుకోలేదు. దూసుకొచ్చిన రైలు ఇద్దరినీ ఢీ కొట్టగా వారు అక్కడికక్కడే చనిపోయారు.